Share News

BJP MLC: లొంగిపోయిన మావోలను సమగ్రంగా విచారించాలి

ABN , Publish Date - Jan 10 , 2025 | 01:06 PM

లొంగిపోయిన మావోయిస్టులను సమగ్రంగా విచారించాలని బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సీటీ రవి(Senior BJP leader and MLC CT Ravi) డిమాండ్‌ చేశారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారని చెబుతున్నారన్నారు. కా

BJP MLC: లొంగిపోయిన మావోలను సమగ్రంగా విచారించాలి

- ఏళ్లుగా చట్ట వ్యతిరేక పనులకు పాల్పడ్డారు

- పాకిస్తాన్‌, ఐఎస్‌ఐ సాయం పొందారు: బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సీటీ రవి

బెంగళూరు: లొంగిపోయిన మావోయిస్టులను సమగ్రంగా విచారించాలని బీజేపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ సీటీ రవి(Senior BJP leader and MLC CT Ravi) డిమాండ్‌ చేశారు. బెంగళూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మావోయిస్టులు ఆయుధాలను వీడి జనజీవనస్రవంతిలోకి వచ్చారని చెబుతున్నారన్నారు. కానీ ఎన్నో ఏళ్లుగా వారు చట్టవ్యతిరేక కార్యకాపాలలో భాగస్వామ్యులయ్యారన్నారు. మావోయిస్టులు చైనా సహకారంతోపాటు పాకిస్తాన్‌కు చెందిన ఐఎ్‌సఐ వంటి ఉగ్రవాద సంస్థల సహకారం ఇచ్చినట్లు గతంలో పలు సంఘటనలు రుజువయ్యాయన్నారు. లొంగిపోయినవారు మోసం చేసేందుకు వచ్చారో ఏమో తెలియదన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Renigunta: స్పెషల్‌ ఫ్లైట్లతో కిటకిటలాడిన ఎయిర్‌పోర్ట్‌


zzz.jpg

తమ పోరాటం తప్పుగా భావించి లొంగిపోయి ఉంటే మంచిదే అన్నారు. వీరి పరివర్తన వెనుక ఎవరున్నారనేది బహిరంగం కావాలన్నారు. ప్రభుత్వం ఏ ఆలోచన లేకుండానే లొంగిపోయినవారిని విచారణ జరిపించాలన్నారు. వీరు నిజమైన మావోయిస్టులు అయితే సమస్య లేదని, ప్రజాప్రభుత్వ సిద్ధాంతాలను వ్యతిరేకించారని జాతీయత, రాజ్యాంగ వ్యతిరేక పాలసీలను పాటించారన్నారు. వారికి బుల్లెట్‌లపై ఉన్న నమ్మకం బ్యాలెట్‌లపై లేదనేది తెలిసిందే అన్నారు.


ఉన్నఫళంగా ఒకేసారి ఆరుగురు లొంగిపోవడం వెనుక ఉద్దేశం ఏమిటన్నారు. లబ్ధి పొందేందుకు వచ్చారా..? ఇతరత్రా కారణాలు ఏమైనా ఉన్నాయనేది కూడా విచారణలో తేల్చాలన్నారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీనియర్‌ ఎమ్మెల్యే సునిల్‌కుమార్‌ స్పందిస్తూ.. మావోయిస్టుల లొంగుబాటుపై పలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మావోయిస్టుల నియంత్రణ దళానికి లభించని నక్సల్స్‌ ఆచూకీ సీఎంకు ఎలా సాధ్యమైందన్నారు. మావోయిస్టులు చట్టం ముందు లొంగిపోవడం మంచిదే అన్నారు. వారు శాంతికోసం జనజీవనస్రవంతిలోకి ప్రజాసంఘాల నేతల ద్వారా సీఎం సమక్షంలో లొంగిపోవడం అనుమానాలకు కారణమవుతోందన్నారు.


zzzzzz.jpg

చట్టప్రక్రియకు ముందే ఏ, బీ, సీ అంటూ వర్గీకరణ చేసి ప్యాకేజి ఎలా ప్రకటిస్తారన్నారు. సీఎం పిలుపుతో వారంలోనే లొంగిపోయే ప్రక్రియ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. తద్వారా రాత్రింబవళ్లు తేడా లేకుండా అడవుల్లో కూంబింగ్‌ చేస్తూ ప్రజలను రక్షించాలనే లక్ష్యం కలిగిన మావోయిస్టులు నియంత్రణ దళం నైతిక స్థైర్యం కోల్పోయినట్లు కాదా..? అని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్సీ రవికుమార్‌ బెంగళూరులో మాట్లాడుతూ మావోయిస్టులను ఆడంబరంగా తీసుకొచ్చి సీఎం సమక్షంలో లొంగిపోయినట్లు చూపడం ఎంతవరకు సరి అన్నారు.


వారు చిక్కమగళూరు జిల్లా అధికారి ఎదుట లొంగిపోవాలని భావిస్తే కాదు కూడదని భారీ కాన్వాయ్‌ రూపంలో బెంగళూరుకు తీసుకొచ్చి సీఎం అధికారిక నివాసం వద్ద ఎలా లొంగిపోతారన్నారు. ఉపముఖ్యమంత్రి, హోం మంత్రుల సమక్షంలో లొంగిపోవడాన్ని ఏమని అర్థం చేసుకోవాలన్నారు. కాగా సీఎం సమక్షంలో మావోయిస్టులు లొంగిపోవడాన్ని ప్రశ్నించే బీజేపీ నేతలు హోం మంత్రి అమిత్‌షా సమక్షంలో లొంగిపోవడాన్ని ఎందుకు వ్యతిరేకించరని కాంగ్రెస్‌ ఎక్స్‌ ద్వారా ప్రశ్నించింది.


ఈవార్తను కూడా చదవండి: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 01:37 PM