Share News

Former CM: మాజీ సీఎం బంధువుల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు

ABN , Publish Date - Jan 10 , 2025 | 10:56 AM

ఈరోడ్‌ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి(Edappadi K. Palaniswami)కి చెందిన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మూడో రోజైన బుధవారం కూడా తనిఖీలు చేశారు.

Former CM: మాజీ సీఎం బంధువుల ఇళ్లల్లో ఐటీ తనిఖీలు

చెన్నై: ఈరోడ్‌ జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి కె.పళనిస్వామి(Edappadi K. Palaniswami)కి చెందిన బంధువుల ఇళ్లు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ అధికారులు మూడో రోజైన బుధవారం కూడా తనిఖీలు చేశారు. ఈరోడ్‌కు చెందిన అవల్‌పూందురైకు చెందిన రామలింగం అనే వ్యాపారవేత్తకు ఎన్‌ఆర్‌ రియల్‌ ఎస్టేట్‌, టోల్‌ ప్లాజా, కల్యాణ మండపాలు, టార్చ్‌ పిండిమిల్లు ఇలా అనేక వ్యాపారాలున్నాయి. వీటికి ఆయన కుమారుడు సూర్యకాంత్‌ సహా మరికొందరు డైరెక్టర్లుగా ఉన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌(Tamil Nadu, Andhra Pradesh) రాష్ట్రాల్లో రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్టులు నడుపుతోంది.

ఈ వార్తను కూడా చదవండి: Sankranti festival: సొంతూళ్లకు వెళ్లేందుకు 1.32 లక్షమంది రిజర్వేషన్‌


nani2.2.jpg

అయితే, గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రామలింగం ఆస్తులు భారీగా పెరిగాయి. దీనికి కారణం నాటి ముఖ్యమంత్రి ఈపీఎస్‌ బంధువు కావడంతో రామలింగం ఆస్తులు బాగా కూడబెట్టుకున్నారనే ప్రచారం జరిగింది. అదేసమయంలో భారీగా పన్ను ఎగవేతకు పాల్పడినట్టు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ నెల 7వ తేదీ నుంచి రామలింగం, ఆయన బంధువులకు చెందిన గృహాలు, కార్యాలయాల్లో తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీలు మూడోరోజైన బుధవారం కూడా కొనసాగాయి.


ఈవార్తను కూడా చదవండి: KTR: ప్రశ్నకు ప్రశ్నే జవాబు

ఈవార్తను కూడా చదవండి: Ticket Booking: ‘మీ టికెట్‌’ యాప్‌

ఈవార్తను కూడా చదవండి: వేళకాని వేళలో సినిమా ప్రదర్శనా?

ఈవార్తను కూడా చదవండి: ఇందిరమ్మ ఇండ్ల ఎంపికలో ఫిర్యాదులకు వెబ్‌సైట్‌

Read Latest Telangana News and National News

Updated Date - Jan 10 , 2025 | 11:19 AM