Viral Video: రూమ్ హీటర్‌ను ఇలాక్కూడా వాడతారా..! ఈమె నిర్వాకం చూస్తే నోరెళ్లబెడతారు..
ABN , Publish Date - Jan 09 , 2025 | 06:16 PM
ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. దీంతో చాలా మంది వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటికి వెళ్తే స్వెట్టర్లు వేసుకుంటుండగా.. కొందరు ఇళ్లల్లో హీటర్లు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని కేవలం చలి నుంచి కాపాడుకోవడానికి మాత్రమే వినియోగిస్తారనే విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే..
ప్రస్తుతం చలి విపరీతంగా ఉంది. దీంతో చాలా మంది వివిధ రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బయటికి వెళ్తే స్వెట్టర్లు వేసుకుంటుండగా.. కొందరు ఇళ్లల్లో హీటర్లు ఉపయోగిస్తున్నారు. అయితే వీటిని కేవలం చలి నుంచి కాపాడుకోవడానికి మాత్రమే వినియోగిస్తారనే విషయం తెలిసిందే. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. ఓ మహిళ రూమ్ హీటర్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు.. ‘‘రూమ్ హీటర్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళ తన ఇంట్లో రూమ్ హీటర్‌ను ఏర్పాటు చేసుకుంది. ఇందులో విశేషం ఏముందీ.. అని అనుకుంటున్నారా. ఆమె హీటర్‌ను వాడిన విధానం చూసి అంతా అవాక్కవుతున్నారు. చలి నుంచి కాపాడునేందుకు వినియోగించాల్సింది పోయి.. హీటర్‌ను ఏకంగా విద్యుత్ స్టవ్ తరహాలో మార్చేసింది. దానిపై ఎంచక్కా (woman made chapatis on room heater) చపాతీలను వేడి చేయడం స్టార్ట్ చేసింది.
Viral Video: ఇందుకే ముంగీసను చూస్తే పాముకు భయం.. ఏం చేసిందో చూడండి..
చపాతీ పిండిని రేకు తరహాలో రోలింగ్ చేసి దాన్ని హీటర్‌పై వేసింది. కాసేపటి తర్వాత రెండో వైపు కూడా అలాగే వేడి చేసింది. ఇలా స్టవ్ లేకుండానే చపాతీలను వేడి చేసిన ఈమె టెక్నిక్ చూసి అంతా అవాక్కవుతున్నారు. గతంలో ఇలా ఇంట్లోని వస్తువులను చిత్రవిచిత్రంగా ఉపయోగించిన వారిని చాలా మందిని చూశాం. కొందరు సైకిల్ పెడల్‌ను వాషింగ్ మెషిన్లా వాడితే, మరికొందరు వాషింగ్ మెషిన్‌ను వంట పాత్రలను క్లీనింగ్ చేసేందుకు వాడేశారు. ఇంకొందరైతే స్టెతస్కోప్‌ను ఏకంగా ఇయర్ ఫోన్లా వాడడం కూడా చూశాం.
Viral Video: కరవడానికి వచ్చిన కుక్కతో కామెడీ చేయడమంటే ఇదే.. ఈ బైకర్ నిర్వాకం చూస్తే..
తాజాగా, హీటర్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘రూమ్ హీటర్‌ను ఇలాక్కూడా వాడొచ్చని ఇప్పుడే తెలిసింది’’.. అంటూ కొందరు, ‘‘ఈ టెక్నాలజీ భారత్ నుంచి బయటకు వెళ్లకూడదు’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 67వేలకు పైగా లైక్‌లు, 4.4 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
ఇవి కూడా చదవండి..
Viral Video: చీకట్లో సైకిల్‌పై వెళ్తున్న యువతి.. వెనుక కారు యజమాని నిర్వాకంతో సడన్‌గా..
Viral Video: కంటతడి పెట్టించిన కోబ్రా.. చనిపోయిన పాము పక్కన పడగ విప్పి మరీ..
Viral Video: పాక శాస్త్రంలో చేయి తిరగడమంటే ఇదేనేమో.. వంట ఎలా చేస్తున్నాడో చూస్తే..
Viral Video: వామ్మో.. పులి వేట ఇంత దారుణంగా ఉంటుందా.. లైవ్‌లో చూసి అంతా షాక్..
Viral Video: యువతి జడను ఇలా వాడేశాడేంటీ.. వెనుక సీట్లో కూర్చున్న వ్యక్తి నిర్వాకం చూడండి..
Viral Video: మీరు కూడా క్యాబేజీ కొంటున్నారా.. ఒక్కసారి ఈ వీడియో చూస్తే ఆలోచనలో పడతారు..
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..