Home » TOP NEWS
నేడు (29-11-2019 - బుధవారం) వృషభ రాశివారు స్టాక్‌మార్కెట్ లావాదేవీల్లో లాభాలు ఆ ర్జిస్తారు. గత అనుభవంతో ఆదాయం పెంపొందించుకుంటారు. ఆస్పత్రులు, బ్యాంకులు, ఫార్మా రంగాల్లో పనిచేసే వృశ్చిక రాశి వారికి నేడు డబ్బే డబ్బు.. ఆర్థికంగా బాగా కలిసొస్తుందట.
హ్యాట్రిక్ విజయాలతో ఐదు టీ20ల సిరీస్‌ను ఖాతాలో వేసుకోవాలనుకున్న యువ భారత్ ఆశలపై గ్లెన్ మ్యాక్స్‌వెల్ (48 బంతుల్లో 8 ఫోర్లు, 8 సిక్సర్లతో 104 నాటౌట్) నీళ్లు జల్లాడు. నరాలు తెగే ఉత్కంఠభరిత మ్యాచ్‌లో.. తనకు మాత్రమే ..
అధికార యంత్రాంగం అలుపెరగని ప్రయత్నం ఫలించింది.. సహాయ సిబ్బంది నిర్విరామ కృషికి ప్రయోజనం దక్కింది.. కుటుంబసభ్యుల ఎదురుచూపులకు తెరపడింది..! ఉత్తరాఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీ జిల్లా సిల్క్యారా
రీల్ స్టోరీకి ఏమాత్రం తగ్గని రియల్ లైఫ్ ఘటన ఒకటి ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. పిస్తోళ్లు పట్టుకున్న గ్యాంగ్స్టర్లు సైతం బూజుల కర్ర ముందు బలాదూర్ అయ్యారు. బ్రూమ్ స్టిక్ దెబ్బకి గ్యాంగ్స్టర్లు కాళ్లకు బుద్ధి చెప్పారు. ద్విచక్ర వాహనాలపై పరారయ్యారు. బ్రూమ్ స్టిక్ పట్టిన హర్యానా వీర మహిళ ఇప్పుడు ఒక్కసారిగా వార్తల్లో హైలైట్ అయింది.
ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌లో టీమిండియా జోరు కొనసాగుతోంది. వరుసగా మూడో టీ20లోనూ భారీ స్కోరు సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ సెంచరీతో ఊచకోత కోశాడు.
Team India: ఆస్ట్రేలియాతో ఆడుతున్న తొలి రెండు మ్యాచ్‌లలో రింకూ సింగ్ చివరి ఓవర్లలో స్ట్రయికింగ్ చేస్తూ అత్యధిక పరుగులు రాబడుతున్నాడు. టీ20 క్రికెట్లో 19, 20 ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు. దీంతో గత మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20లో మరోసారి చివరి రెండు ఓవర్లలో రింకూ సింగ్ చెలరేగితే అత్యధిక సార్లు చివరి రెండు ఓవర్లలో 30కి పైగా పరుగులు చేసిన బ్యాటర్‌గా కోహ్లీని అధిగమిస్తాడు.
కాంగ్రెస్ సీనియర్ నేత, వయనాడ్ ఎంపీ రాహుల్ గాంధీ మళ్లీ విదేశాలకు వెళ్లనున్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు వచ్చేనెల 4వ తేదీ నుంచి ప్రారంభం కానున్న తరుణంలో రాహుల్ విదేశీ పర్యటనకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చాయి. డిసెంబర్ 9 నుంచి ఇండోనేషియా, సింగపూర్, మలేషియా, వియత్నాంలలో రాహుల్ పర్యటించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం.
T20 Cricket: టీమిండియా ఈరోజు గౌహతి వేదికగా ఆస్ట్రేలియాతో మూడో టీ20లో తలపడుతోంది. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీ20 సిరీస్‌తో పాటు ప్రపంచ రికార్డును సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ మాథ్యూ వేడ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. నాలుగు మార్పులతో తాము బరిలోకి దిగుతున్నట్లు స్పష్టం చేశాడు.
ఇజ్రాయెల్-హమాస్మధ్య కుదిరిన నాలుగు రోజుల తాత్కాలిక సంధి గడువు మరో రెండు రోజులు పొడిగించారు. ఒప్పందంలో భాంగా 50 మంది మహిళా ఖైదీలను విడుదల చేసేందుకు ఇజ్రాయెల్ అంగీకరించింది. ఇందుకు ప్రతిగా హమాన్ చెరలో ఉన్న మరో 20 మంది ఖైదీలు విడుదల అవుతారని ఇజ్రాయెల్ భావిస్తోంది.
IPL 2024: వచ్చే సీజన్ కోసం కెప్టెన్ హార్దిక్ పాండ్యాను ట్రేడింగ్ విండో ద్వారా ముంబై ఇండియన్స్‌కు బదిలీ చేసిన గుజరాత్ జట్టు డిసెంబర్ 19న జరిగే వేలంలో ఆల్‌రౌండర్‌ను తీసుకునే అంశంపై దృష్టి సారించింది. పాండ్యా స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడి కోసం తీవ్రంగా ప్రయత్నించనుంది. ఈ నేపథ్యంలో గుజరాత్ ముఖ్యంగా నలుగురు ఆటగాళ్లను టార్గెట్ చేసే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.