బైక్‌ కాదు.. కారు కూడా కాదు.. ఏకంగా హెలీకాఫ్టర్‌కు యాదాద్రిలో పూజలు.. వైరల్‌గా మారిన వీడియో..!

ABN , First Publish Date - 2022-12-16T16:09:18+05:30 IST

బైకు, కారు, బస్సు.. ఇలా కొత్తగా ఏ వాహనం కొన్నా ఇష్టమైన దేవుడి ఆలయం వద్ద పూజలు చేయించడం సర్వసాధారణమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే..

బైక్‌ కాదు.. కారు కూడా కాదు.. ఏకంగా హెలీకాఫ్టర్‌కు యాదాద్రిలో పూజలు.. వైరల్‌గా మారిన వీడియో..!

బైకు, కారు, బస్సు.. ఇలా కొత్తగా ఏ వాహనం కొన్నా ఇష్టమైన దేవుడి ఆలయం వద్ద పూజలు చేయించడం సర్వసాధారణమే. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఓ వ్యాపారవేత్త ఏకంగా హెలీకాఫ్టర్‌కే (Helicopter) పూజలు చేయించారు. కొత్తగా కొన్న హెలీకాఫ్టర్‌ను డైరెక్ట్ యాదాద్రికి (Yadadri temple) తీసుకెళ్లి పూజలు చేయించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి...

Viral Video: వధూవరుల మధ్య బిగ్ ఫైట్.. వద్దన్నా స్వీట్ తినిపించాడని చెంప పగలగొట్టి మరీ..!

తెలంగాణలోని (Telangana) ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ప్రతిమ మెడికల్ కళాశాల ఎండీ, ప్రతిమ గ్రూప్స్ అధినేత బోయినపల్లి శ్రీనివాస రావు (Boinapalli Srinivasa Rao) ఇటీవల కొత్తగా హెలీకాఫ్టర్‌ను (Airbus ACH 135) కొలుగోలు చేశారు. దీంతో పూజలు చేయించే నిమిత్తం హెలీకాఫ్టర్‌ను నేరుగా యాదగిరిగుట్టకు తీసుకొచ్చి.. టెంపుల్ సిటీలోని హెలీకాఫ్టర్‌ వద్ద ల్యాండ్ చేశారు. పూజారులు వాహనానికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీనివాసరావు బంధువైన మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హాజరయ్యారు. శ్రీనివాస రావు, విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులు.. హెలీకాఫ్టర్‌లో గిరిప్రదక్షిణ చేశారు. ఇదిలావుండగా, హెలీకాఫ్టర్‌ను చూసేందుకు స్థానికులు పెద్ద ఎత్తున తరలివచ్చి, ఆసక్తిగా తిలకించారు.

అనుకోకుండా ఇంటికొచ్చిన మొదటి భార్య.. అర్ధరాత్రి రెండో భార్య గదిలోకి పామును వదిలిన భర్త.. ఉదయం చూస్తే..

Updated Date - 2022-12-16T16:13:15+05:30 IST