Paritala Sriram: టీడీపీతో పెట్టుకోవద్దు... కేతిరెడ్డికి పరిటాల హెచ్చరిక

ABN , First Publish Date - 2023-04-04T15:01:14+05:30 IST

ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Paritala Sriram: టీడీపీతో పెట్టుకోవద్దు... కేతిరెడ్డికి పరిటాల హెచ్చరిక

అనంతపురం: వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (YCP MLA KetiReddy Venkatarami Reddy)పై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌ (TDP Leader Paritala Sriram) ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. గుడ్ మార్నింగ్ తప్ప వేరే వ్యాపార వ్యవహారాలు లేని కేతిరెడ్డికి వందల ఎకరాలు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. ‘‘నీ కథలు అందరికి తెలుసు..పిచ్చి మాటలు ఆపు. నీపైన వేసే సిట్ విచారణకు సిద్ధంగా ఉండు’’ అంటూ హెచ్చరించారు. వైసీపీ ఎమ్మెల్యేల చేతుల్లో ఉద్యోగులు ఇరుక్కుపోతున్నారని మండిపడ్డారు. 25 ఎకరాలను కొనుగోలు చేసి 40 ఎకరాలను ఆక్రమించుకున్నారని ఆరోపించారు. ఎన్‌వోసీలు ఇవ్వకపోవడంతో కలెక్టర్‌ను దూషించారని అన్నారు. నియోజకవర్గం నుంచి అక్రమంగా మట్టి, ఇసుక తరలిస్తున్నారని వ్యాఖ్యలు చేశారు. ‘‘టీడీపీతో పెట్టుకోవద్దు...నీ చరిత్ర బయట పెడుతాం’’ అంటూ పరిటాల శ్రీరామ్‌ హెచ్చరించారు.

Updated Date - 2023-04-04T15:01:14+05:30 IST