Kalavenkatarao: కరెంటు కోతలు ప్రజలకు....జే-టాక్స్ జగన్‌రెడ్డికా?

ABN , First Publish Date - 2023-08-29T20:15:52+05:30 IST

రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతల(Power cuts)తో ఓవైపు ప్రజలు, మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు (Kalavenkatarao) అన్నారు.

Kalavenkatarao: కరెంటు కోతలు ప్రజలకు....జే-టాక్స్ జగన్‌రెడ్డికా?

అమరావతి: రాష్ట్రంలో అప్రకటిత విద్యుత్ కోతల(Power cuts)తో ఓవైపు ప్రజలు, మరోవైపు రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలుగుదేశం సీనియర్ నేత కిమిడి కళావెంకట్రావు (Kalavenkatarao) అన్నారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, మంత్రులు జే-టాక్స్ వసూళ్లలో మునిగితేలుతూ విద్యుత్ కోతలతో ప్రజలను వేధిస్తున్నారు. కరెంటు కోతలు ప్రజలకు....జే-టాక్స్(
J-tax) జగన్‌రెడ్డికా? అని ప్రశ్నించారు. అప్రకటిత విద్యుత్ కోతలకు అన్నదాలు బలికావాలా? అని నిలదీశారు.పాలన చేతగాకపోతే దిగిపోవాలి...అంతేగానీ 18 గంటలు కరెంటు కోతలు విదిస్తారా? అని ప్రశ్నించారు. రైతుల ఆందోళనలకు భయపడి విద్యుత్ ఉద్యోగులు సబ్‌ష్టేషన్లు వదిలి పారిపోయే పరిస్థితులు నెలకొన్నాయని చెప్పారు.

అడ్డగోలుగా విద్యుత్ ఛార్జీలు పెంచడమే కాకుండా అప్రకటిత కరెంటు కోతలు విధిస్తూ వినియోగదారులకు సీఎం జగన్‌రెడ్డి పగలే చుక్కలు చూపిస్తున్నారని ధ్వజమెత్తారు. వర్షాకాలంలో కూడా విద్యుత్ కోతలు పెట్టిన మొట్టమొదటి ముఖ్యమంత్రిగా జగన్‌రెడ్డి మిగిలిపోతారని విమర్శించారు. నీరులేక నారుమళ్లు ఎండిపోతున్నాయి. మొలకదశలోనే ఎండిపోతున్న పంటలకు ఎవరు సమాధానం చెబుతారన్నారు.ముఖ్యమంత్రి, మంత్రులు దీనికి ఏం సమాధానం చెబుతారు? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను నాశనం చేయడం వల్లే వర్షాకాలంలో కూడా కరెంటు కష్టాలు పడుతున్నామన్నారు.ఇకనైనా ప్రభుత్వ యంత్రాంగం యుద్ధప్రాతిపదికన స్పదించి కరెంటు కోతలకు చెక్ పెట్టాలని కోరారుర. లేకపోతే ప్రజల తిరుబాటును ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉండాలని కిమిడి కళావెంకట్రావు హెచ్చరించారు.

Updated Date - 2023-08-29T20:15:52+05:30 IST