Share News

AP High Court: కాగ్నిజబుల్ నేరాలపై ఫిర్యాదు చేసినా కేసులు కట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

ABN , First Publish Date - 2023-11-28T21:49:59+05:30 IST

కాగ్నిజబుల్ ( cognizable ) నేరాలపై ఫిర్యాదు చేసినా కేసులు కట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసునమోదు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు గుర్తుచేసింది.

AP High Court: కాగ్నిజబుల్ నేరాలపై ఫిర్యాదు చేసినా కేసులు కట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

అమరావతి: కాగ్నిజబుల్ ( cognizable ) నేరాలపై ఫిర్యాదు చేసినా కేసులు కట్టకపోవడంపై ఏపీ హైకోర్టు ( AP High Court ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఫిర్యాదు వచ్చిన వెంటనే కేసునమోదు చేయకపోతే పోలీసులపై చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు తీర్పును హైకోర్టు గుర్తుచేసింది. లలితకుమారి వర్సెస్‌ యూపీ ప్రభుత్వం కేసులో సుప్రీం తీర్పును తెలుగులోకి అనువదించి ఏపీ పోలీసులకు పంపాలని డీజీపీకి ఆదేశించింది. కాగ్నిజబుల్ నేరాల్లో కేసు నమోదు చేయకపోతే.. పిటిషనర్‌కు సమాధానం చెప్పాల్సి ఉంటుందని హైకోర్టు తెలిపింది. విశాఖపట్నంలో ఇరువురు వ్యక్తులు ఇచ్చిన పిటిషన్లపై కేసునమోదు చేయకపోవడంతో హైకోర్టును పిటిషనర్లు ఆశ్రయించారు. పిటిషనర్ల తరపున న్యాయవాది ఉమేష్‌చంద్ర వాదనలు వినిపించారు.

Updated Date - 2023-11-28T21:50:00+05:30 IST