Share News

YS Viveka: వైఎస్ వివేకా కేసులో జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ.. ఎందుకంటే..?

ABN , Publish Date - Dec 30 , 2023 | 08:30 PM

వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు.

YS Viveka: వైఎస్ వివేకా కేసులో జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ.. ఎందుకంటే..?

కడప: వైఎస్ వివేకానందారెడ్డి ( YS Vivekananda Reddy ) కేసుకు సంబంధించి జమ్మలమడుగు కోర్టుకు సీబీఐ అధికారులు వెళ్లారు. హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ కాపీలను కోర్టుకు సీబీఐ అధికారులు సమర్పించారు. నాటి సీబీఐ విచారణాధికారి రామ్‌సింగ్, వివేకాకుమార్తె సునీత, రాజశేఖర్‌రెడ్డిపై పులివెందుల కోర్టులో పోలీసులు ఛార్జిషీటు దాఖలు చేశారు. ఈ కేసును క్యాష్ చేయాలని హైకోర్టును రాంసింగ్, సునీత, రాజశేఖర్‌రెడ్డిలు ఆశ్రయించారు. ఆ కాపీలను జమ్మలమడుగు కోర్టులో సీబీఐ అధికారులు అందజేశారు. జమ్మలమడుగు మెజిస్ట్రేట్ భార్గవి.. పులివెందుల కోర్టుకు ఇన్‌చార్జి కావడంతో సీబీఐ అధికారులు కాపీలు అందజేశారు.

Updated Date - Dec 30 , 2023 | 08:30 PM