AP NEWS: ఎన్టీఆర్ జిల్లా నందిగామలో రచ్చకెక్కిన విగ్రహాల వివాదం
ABN , First Publish Date - 2023-08-31T19:36:37+05:30 IST
నందిగామ(Nandigama)లో మరొసారీ విగ్రహాల వివాదం రాజుకుంది. గురువారం నాడు నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో తెలుగుదేశం నేతలు(Telugu Desam Leaders), మున్సిపల్ అధికారుల మధ్య విగ్రహాలపై ఘర్షణ తలెత్తింది.
ఎన్టీఆర్ జిల్లా: నందిగామ(Nandigama)లో మరొసారీ విగ్రహాల వివాదం రాజుకుంది. గురువారం నాడు నిర్వహించిన మున్సిపల్ సమావేశంలో తెలుగుదేశం నేతలు(Telugu Desam Leaders), మున్సిపల్ అధికారుల మధ్య విగ్రహాలపై ఘర్షణ తలెత్తింది. ఎన్టీఆర్ విగ్రహం ఎక్కడ ఉందని టీడీపీ కౌన్సిలర్లు మున్సిపల్ అధికారులను ప్రశ్నించారు. కమిటీ సభ్యులోని ఒకరికి అప్పగించామని మున్సిపల్ అధికారులు(Municipal Authorities) నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. ప్రస్తుతం వైసీపీ(YCP)లో ఉంటున్న వ్యక్తికి విగ్రహాన్ని ఎలా ఇస్తారని మున్సిపల్ అధికారులను టీడీపీ సభ్యులు నిలదీశారు. విగ్రహలకు తాము కాపాలా ఉండాలా అంటూ మున్సిపల్ అధికారులు విచిత్ర వాదన తెరమీదకు తీసుకొచ్చారు. సమావేశం ముగిసిన తర్వాత కమిషనర్ కార్యాలయంలో కమిషనర్ని నిలదీశారు. టీడీపీ సభ్యులకు గాని, మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య(Tangirala Soumya)కు చెప్పకుండా ఎలా ఇస్తారని నిలదీశారు. ఎవరికి ఇచ్చారో కాపీ ఇవ్వాలని టీడీపీ సభ్యులు పట్టుబట్టారు. ఎవరకు బడితే వారికి ఎలా ఇస్తారని అడిగారు. రోడ్ల విస్తరణ పేరుతో ఇటీవల గాంధీ సెంటర్లో ఉన్న విగ్రహాలను మున్సిపల్ అధికారులు తొలగించిన విషయం తెలిసిందే.తొలగించిన విగ్రహాలను మున్సిపల్ కార్యాలయంలో అధికారులు భద్రపరిచారు.