National Best Teacher Awards: 2023 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం

ABN , First Publish Date - 2023-09-02T20:36:41+05:30 IST

2023 ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులను (National Best Teacher Awards) కేంద్రప్రభుత్వం(Central Govt) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది.

National Best Teacher Awards: 2023 జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను ప్రకటించిన కేంద్రం

ఢిల్లీ: 2023 ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డులను (National Best Teacher Awards) కేంద్రప్రభుత్వం(Central Govt) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 75 మంది ఉపాధ్యాయులను కేంద్రం ఎంపిక చేసింది. సెప్టెంబర్ 5వ తేదీన ఢిల్లీలో అవార్డుల ప్రధానోత్సవంలో రాష్టప్రతి ద్రౌపది ముర్ము(Draupadi Murmu) ప్రత్యేక అతిథిగా పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో ఎంపిక చేసిన ఉపాధ్యాయులకు రాష్ట్రపతి చేతులమీదుగా అవార్డులను అందజేస్తారు. ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డుల్లో ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)కి మూడు, తెలంగాణ(Telangana) 2అవార్డులు గెలుచుకుంది.ఏపీ నుంచి ఉత్తమ టీచర్ అవార్డు ఎంపికైన మేకల భాస్కర్ రావు నెల్లూరు ఎంసీపీస్ కొండయపాలెం 20th డివిజన్‌ స్కూళులో పనిచేస్తున్నారు. మురహరరావు ఉమా గాంధీ, జీ వి.ఎంసీపీ స్కూల్ శివాజీ పాలెం పాఠశాలలో విధులు నిర్వర్తిస్తున్నారు.. సెట్టెం ఆంజనేయులు, ఎస్.ఆర్ ఆర్ జెడ్పీ హై స్కూల్, మాసపేట, రాయచోటి పాఠశాలలో టీచర్‌గా చేస్తున్నారు.తెలంగాణ నుంచి అర్చన నూగురి, ఎంపీపీస్ రెబ్బనపల్లీ, మంచిర్యాలలో ఉపాధ్యాయులు. సంతోష్ కుమార్ మండల పరిషత్ అప్పర్ ప్రైమరీ స్కూల్, భీమ్ పురా,ఆదిలాబాద్ పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉత్తమ జాతీయ ఉపాధ్యాయ అవార్డుల గెలుచుకోవడంపై ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆయా పాఠశాలల్లోని విద్యార్థులు సంబురాలు చేసుకుంటున్నారు.

Updated Date - 2023-09-02T20:36:41+05:30 IST