Election results : మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ స్పందన ఇదే..

ABN , First Publish Date - 2023-03-02T12:34:07+05:30 IST

త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలపై

Election results : మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ స్పందన ఇదే..
Congress Chief Mallikharjuna Kharge

న్యూఢిల్లీ : త్రిపుర, మేఘాలయ, నాగాలాండ్ రాష్ట్రాల శాసన సభలకు జరిగిన ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న లోక్‌సభ (Lok Sabha) ఎన్నికలపై ఉంటుందని చాలా మంది విశ్లేషకులు చెప్తున్నారు. ఇదే విషయాన్ని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikharjuna Kharge) వద్ద ప్రస్తావించినపుడు, అదేమీ లేదని, సాధారణంగా ఈశాన్య రాష్ట్రాల్లోని పార్టీలు కేంద్ర ప్రభుత్వంవైపు వెళ్తూ ఉంటాయని చెప్పారు. అయితే చాలా మంది నేతలు జాతీయ రాజకీయాలకు కట్టుబడి ఉంటారని తెలిపారు. అటువంటివారు కాంగ్రెస్, లౌకికవాద పార్టీలు, ప్రజాస్వామ్యం, రాజ్యాంగాలకు మద్దతిస్తారన్నారు.

ఈ మూడు రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం ప్రారంభమైంది. తాజా సమాచారం ప్రకారం వీటన్నిటిలోనూ బీజేపీ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖర్గే మీడియాతో మాట్లాడుతూ, ఈశాన్య రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు సాధారణంగా లౌకికవాద పార్టీలకు మద్దతిస్తాయన్నారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కాంగ్రెస్ కూటమి ఏర్పడటానికి ఈ పార్టీలు అనుకూలంగా ఉంటాయన్నారు. తమతో జట్టుకట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ ముందడుగు వేయాలని ఈ పార్టీలు కోరుకుంటాయన్నారు.

ఇదిలావుండగా, నాగాలాండ్‌లో బీజేపీ-ఎన్‌డీపీపీ కూటమి 35 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. త్రిపురలో బీజేపీ 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మేఘాలయలో బీజేపీ గతం కన్నా మూడు స్థానాలను ఎక్కువగా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఐదు స్థానాల్లో ఆధిక్యత ప్రదర్శిస్తోంది.

కాంగ్రెస్ (Congress) అభ్యర్థులు మేఘాలయ (Meghalaya)లో ఐదు స్థానాల్లోనూ, నాగాలాండ్‌ (Nagaland)లో రెండు స్థానాల్లోనూ ఆధిక్యంలో కనిపిస్తున్నారు. త్రిపుర (Tripura)లో ఆ పార్టీ అభ్యర్థులు వెనుకంజలో ఉన్నారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ శాసన సభ నియోజకవర్గాల సంఖ్య సమానంగా ఉంది. ప్రతి రాష్ట్రంలోనూ 60 చొప్పున స్థానాలు ఉన్నాయి.

ఇవి కూడా చదవండి :

Nagaland Assembly Election Results 2023 : నాగాలాండ్ ఎన్నికల్లో బీజేపీకి షాక్!

Tripura Assembly Elections Results 2023 : త్రిపురలో బీజేపీ కూటమి ముందంజ... సుదూరంగా కాంగ్రెస్-వామపక్షాలు...

Updated Date - 2023-03-02T12:38:00+05:30 IST