Air India flight: గంట సేపు ప్రయాణించిన తర్వాత మెల్‌బోర్న్‌కు తిరిగి వెళ్లిన విమానం.. ఎందుకంటే..?

ABN , First Publish Date - 2023-07-31T09:19:40+05:30 IST

మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన(Delh to Melbourne) ఎయిర్ ఇండియా విమానం(Air India flight medical emergency) మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మెల్‌బోర్న్‌‌కు తిరిగి వచ్చింది. ఒక గంటకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో విమానాన్ని వెనక్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది.

Air India flight: గంట సేపు ప్రయాణించిన తర్వాత మెల్‌బోర్న్‌కు తిరిగి వెళ్లిన విమానం.. ఎందుకంటే..?

ఢిల్లీ: మెల్‌బోర్న్ నుంచి ఢిల్లీకి వెళ్లాల్సిన(Delh to Melbourne) ఎయిర్ ఇండియా విమానం(Air India flight medical emergency) మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా మెల్‌బోర్న్‌‌కు తిరిగి వచ్చింది. ఒక గంటకుపైగా గాలిలో ప్రయాణించిన తర్వాత అనారోగ్యంతో బాధపడుతున్న ఓ ప్రయాణికుడిని ఆసుపత్రిలో చేర్చాల్సి రావడంతో విమానాన్ని వెనక్కి తీసుకువెళ్లాల్సి వచ్చింది. అనారోగ్యానికి గురైన ప్రయాణికుడిని, అతని కుటుంబసభ్యులను ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో(Australia Melbourne) దింపిన తర్వాత మళ్లీ ఢిల్లీకి బయలుదేరింది. కాగా ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. తిరిగి బయలుదేరిన విమానం సాయంత్రం ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. ‘‘బోయింగ్ డ్రీమ్‌లైనర్‌తో నడిచే ఏఐ309 విమానం గాలిలో గంటకుపైగా ప్రయాణించిన తర్వాత ఓ ప్రయాణికుడు అస్వస్థతకు గురయ్యాడు. అతడికి చికిత్స చేసిన విమానంలోని వైద్యుడు ఆసుపత్రిలో చేర్చాలని సూచించారు. మెడికల్ ఎమర్జెన్సీ కాబట్టి విమానం తిరిగి మెల్‌బోర్న్‌కు వచ్చింది.’’ అని ఎయిర్‌లైన్స్ అధికారి తెలిపారు. కాగా అస్వస్థకు గురైన ప్రయాణికుడి వివరాలను వెల్లడించలేదు.

Updated Date - 2023-07-31T09:21:02+05:30 IST