Share News

Onion Price: రూ.2 కే కిలో ఉల్లిగడ్డ.. ఎక్కడో తెలుసా?..

ABN , Publish Date - Dec 27 , 2023 | 12:18 PM

ఉల్లిగడ్డ నిత్యం ఎవరో ఒకరిని కన్నీళ్లు పెట్టిస్తుంటుంది. పంట పండించాక మార్కెట్‌లో అమ్ముకునే సమయంలో సరైన మద్దతు ధర లభించక రైతును ఏడిపిస్తుంది. కొనేందుకు మార్కెట్‌కు వెళ్లినప్పుడు భారీ ధరలతో అనేక మార్లు సాధారణ ప్రజలను ఏడిపిస్తుంది.

Onion Price: రూ.2 కే కిలో ఉల్లిగడ్డ.. ఎక్కడో తెలుసా?..

ముంబై: ఉల్లిగడ్డ నిత్యం ఎవరో ఒకరిని కన్నీళ్లు పెట్టిస్తుంటుంది. పంట పండించాక మార్కెట్‌లో అమ్ముకునే సమయంలో సరైన మద్దతు ధర లభించక రైతును ఏడిపిస్తుంది. కొనేందుకు మార్కెట్‌కు వెళ్లినప్పుడు భారీ ధరలతో అనేక మార్లు సాధారణ ప్రజలను ఏడిపిస్తుంది. ఇక ఇప్పుడు వ్యాపారుల వంతు వచ్చింది. భారీగా తగ్గిన ఉల్లి ధరలు వ్యాపారులను కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. మహారాష్ట్రలో ఉల్లి గడ్డ ధరలు భారీగా పడిపోయాయి. మహారాష్ట్ర ఉల్లి బెల్ట్‌లోని అనేక హోల్‌సేల్ మార్కెట్లలో ఉల్లి ధరలు కిలోకు రూ.2 నుంచి రూ.5 వరకు మాత్రమే పలుకుతున్నాయి.


వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం డిసెంబర్ 5 నుంచి 26 వరకు గత మూడు వారాల్లో రిటైల్ మార్కెట్‌లో ఉల్లి ధరలు వివిధ రాష్ట్రాల్లో 10 శాతం నుంచి 34 శాతం తగ్గాయి. అంటే కిలోకు సగటున రూ.40 నుంచి రూ.60 వరకు తగ్గాయని గణాంకాలు చెబుతున్నాయి. ఉల్లి ధరలుఇంతలా తగ్గడానికి ఎగుమతులను నిషేధించడమే కారణంగా తెలుస్తోంది. డిసెంబర్ 8 నుంచి దేశం నుంచి ఉల్లి ఎగుమతులను నిషేధించడంతో ధరలు భారీగా పడిపోయాయి. దీంతో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పండించిన ఉల్లి పంటను మహారాష్ట్రకే తరలిస్తున్నారు. ఆయా రాష్ట్రాల నుంచి ఉల్లిగడ్డల రాక పెరగడంతో ధరలు భారీగా తగ్గాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Dec 27 , 2023 | 12:58 PM