Reservations: రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ సంచలన వ్యాఖ్యలు.. ఎంతకాలం కొనసాగాలన్నారంటే..
ABN , First Publish Date - 2023-09-07T10:21:16+05:30 IST
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవ్ (Mohan Bhagwat) రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఇంకా ఉందని, సమానత్వం వచ్చేవరకు రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగాలని అన్నారు. నాగ్‌పూర్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
నాగ్‌పూర్: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భగవ్ (Mohan Bhagwat) రిజర్వేషన్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మన సమాజంలో వివక్ష ఇంకా ఉందని, సమానత్వం వచ్చేవరకు రిజర్వేషన్లు కచ్చితంగా కొనసాగాలని అన్నారు. నాగ్‌పూర్‌లో బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నేటి యువత వృద్ధులుగా మారకముందే ‘అఖండ భారత్’ లేదా ‘అవిభజిత ఇండియా’ నిజమవుతుందన్నారు. 1947లో ఇండియా నుంచి విడిపోయినవారు తప్పుచేశామని ఇప్పుడు బాధపడుతున్నారని అన్నారు. రిజర్వేషన్ల కోసం మరాఠా కమ్యూనిటి ప్రజలు తమ ఆందోళనలను ఉధృతం చేస్తున్న సమయంలో మోహన్ భగవంత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘ సామాజిక వ్యవస్థలో తోటివారిని మన వెనుక ఉంచాం. వాళ్ల కోసం మనం జాగ్రత్త తీసుకోలేదు. ఇది 2000 సంవత్సరాలు కొనసాగుతుంది. వారికి మనం సమానత్వం కల్పించేవరకు కొన్ని ప్రత్యేక సదుపాయాలు ఉంటాయి. అందులో రిజర్వేషన్లు ఒకటి. అందుకే వివక్ష ఉన్నంతకాలం రిజర్వేషన్లు అమల్లో ఉంటాయి. రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్లకు ఆర్ఎస్ఎస్ అన్ని విధాలా మద్ధతుగా నిలుస్తుంది ’’ అని మోహన్ భగవత్ అన్నారు. కనిపించకపోవచ్చు కానీ సమాజంలో విక్షత ఉందని గుర్తించాలని ఆయన అన్నారు.