UP Police: షారుఖ్‌ను వాడేసిన యూపీ పోలీసులు.. మ్యాటర్ ఏంటంటే..?

ABN , First Publish Date - 2023-09-11T17:58:57+05:30 IST

షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో రూ.520 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు జవాన్‌లో షారుఖ్ ఫోటోను వాడేశారు. ముసలి వారైనా.. పడుచువారైనా.. రోడ్డు ప్రమాదాలలో గాయపడి జవాన్‌లో షారుఖ్‌లా కాకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించాలని ఓ పోస్టర్ రూపొందించారు. యూపీ పోలీసులు తయారుచేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

UP Police: షారుఖ్‌ను వాడేసిన యూపీ పోలీసులు.. మ్యాటర్ ఏంటంటే..?

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోగా తన హవా చూపిస్తున్నాడు. తాజాగా షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో రూ.520 కోట్లకు పైగా కలెక్ట్ చేసి రికార్డులు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో యూపీ పోలీసులు జవాన్‌లో షారుఖ్ ఫోటోను వాడేశారు. ముసలి వారైనా.. పడుచువారైనా.. రోడ్డు ప్రమాదాలలో గాయపడి జవాన్‌లో షారుఖ్‌లా కాకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించాలని ఓ పోస్టర్ రూపొందించారు. యూపీ పోలీసులు తయారుచేసిన ఈ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

ఇది కూడా చదవండి: Jawan Movie: బాబోయ్.. షారూఖ్ అంటే మరీ ఇంత అభిమానమా..? ఓ వ్యక్తి ల్యాప్‌టాప్ తీసుకుని మరీ థియేటర్‌కు వెళ్లి..!

మరోవైపు జవాన్ సినిమాలో షారుఖ్ ఖాన్ ద్విపాత్రాభినయం చేశాడు. తండ్రీకొడుకులుగా రెండు పాత్రలలో అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు పొందుతున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ రూపొందించిన జవాన్ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై గౌరీ ఖాన్ నిర్మించారు. ఈ మూవీలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి వంటి ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకునే స్పెషల్ రోల్‌లో కనిపించింది. ఈ సినిమాకు అనిరుథ్ రవిచందర్ సంగీతాన్ని సమకూర్చాడు.

Updated Date - 2023-09-11T18:02:48+05:30 IST