ATA: వర్జీనియాలో 'ఆటా' 5కే వాక్/రన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విజయవంతం

ABN , First Publish Date - 2023-08-23T09:36:07+05:30 IST

అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆగస్ట్ 20వ తేదిన (ఆదివారం) వర్జీనియాలోని ఆష్ బర్న్ నగరంలోని W&OD ట్రైల్ ప్రాంగణంలో 5కే వాక్/రన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ దిగ్విజయంగా నిర్వహించారు.

ATA: వర్జీనియాలో 'ఆటా' 5కే వాక్/రన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ విజయవంతం

ATA: అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆగస్ట్ 20వ తేదిన (ఆదివారం) వర్జీనియాలోని ఆష్ బర్న్ నగరంలోని W&OD ట్రైల్ ప్రాంగణంలో 5కే వాక్/రన్ ఫిట్‌నెస్ ఛాలెంజ్ దిగ్విజయంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉపాధ్యక్షులు జయంత్ చల్లా, ట్రస్ట్ బోర్డు సభ్యులు సుధీర్ బండారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అందరు ప్రతిరోజు ఒక గంట పాటు వాక్ లేదా రన్నింగ్‌కు కేటాయించి ఆరోగ్యంగా వుండాలని కోరారు.

AAAAA.jpg

ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కార్యక్రమాన్ని సమన్వయపరిచిన శ్రీని మల్లపురం, ఆటా ఫిట్‌నెస్ ఛాలెంజ్ కో-ఆర్డినేటర్ షీతల్ బొబ్బకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఆటా సంస్థ చేస్తున్న సేవా, సహాయ కార్యక్రమాలను వివరించారు. ఈ ఫిట్‌నెస్ ఛాలెంజ్ కార్యక్రమం విజయవంతం కావడానికి సహకరించిన వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

AAAA.jpg

ఈ కార్యక్రమం దిగ్విజయం కావడానికి సహకరించిన ట్రస్ట్ బోర్డు సభ్యులు సుధీర్ బండారు, రవి చల్లా(కార్పోరేట్ స్పాన్సర్షిప్-ఛైర్), రీజనల్ కో-ఆర్డినేటర్ హనిమి వేమిరెడ్డి, అమర్ పాశ్య, హర్ష భరెంకబై, మల్ల కాల్వ, షీతల్ బొబ్బ (సోషల్ మీడియ కమిటి చైర్), రాము ముండ్రాతి (మీడియా కమిటీ చైర్), అమర్ బొజ్జ, సునీల్ కుడికల, ప్రవీణ్ దాసరి (పబ్లిసిటి కమిటి చైర్), కార్యక్రమాన్ని మీడియా కవరేజ్ చేసినది ఈశ్వర్ బండ.

AAA.jpg

AAAAAA.jpg

Updated Date - 2023-08-23T09:36:07+05:30 IST