Share News

Telangana Elections : ఇంటెలిజెన్స్ సర్వేతో ఉలిక్కిపడిన కేసీఆర్.. ‘పీకే’ సాయం కోరిన గులాబీ బాస్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది..!?

ABN , First Publish Date - 2023-11-21T22:20:52+05:30 IST

Prasant Kishore Mets CM KCR : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) సీన్ మారబోతుందా..? ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రినవుతానని పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) సడన్‌గా సీన్ రివర్స్ అయ్యిందని అనిపిస్తోందా..? కాంగ్రెస్ (Congress) ఎక్కడ గెలిచేస్తుందో అని గులాబీ బాస్ భయపడిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే.. గులాబీ దళపతి ఉక్కిరిబిక్కిరవుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది..

Telangana Elections : ఇంటెలిజెన్స్ సర్వేతో ఉలిక్కిపడిన కేసీఆర్.. ‘పీకే’ సాయం కోరిన గులాబీ బాస్.. ఆ మూడు గంటలు ఏం జరిగింది..!?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Assembly Polls) సీన్ మారబోతుందా..? ఎట్టి పరిస్థితుల్లో హ్యాట్రిక్ కొట్టి.. ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రినవుతానని పదే పదే చెబుతున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు (KCR) సడన్‌గా సీన్ రివర్స్ అయ్యిందని అనిపిస్తోందా..? కాంగ్రెస్ (Congress) ఎక్కడ గెలిచేస్తుందో అని గులాబీ బాస్ భయపడిపోతున్నారా..? అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే.. గులాబీ దళపతి ఉక్కిరిబిక్కిరవుతున్నారనే విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఇంతకీ బాస్‌కు ఏమైంది..? ఇంత భయమెందుకు..? అసలు పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతున్న ప్రచారం ఏమిటి..? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ (ABN Andhrajyothy) ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం.


TG-Map-and-Parties.jpg

ఇదీ అసలు కథ..!

అవును.. హ్యాట్రిక్ కొడుతున్నాం.. అనుకున్నన్ని సీట్లు రాకపోవచ్చు కానీ కచ్చితంగా అధికారంలోకి వచ్చేది మాత్రం బీఆర్ఎస్‌ అని అధినేత మొదలుకుని కార్యకర్తల వరకూ చెబుతున్న మాట. అయితే ఇదంతా రెండ్రోజుల కిందటి వరకేనట. ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయిందట. గ్రౌండ్ లెవల్‌లో వినిపిస్తున్న టాక్.. అంతర్గత సర్వేలతో కేసీఆర్ కంగుతిన్నారట. దీంతో హుటాహుటిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్‌ను (Prashant Kishor) హైదరాబాద్‌కు (Hyderabad) పిలిపించుకుని అత్యవసర భేటీ అయ్యారన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) నడుస్తున్న బిగ్ డిబేట్. ‘ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాల్సిందే.. ఉన్న ఈ కొద్దిరోజుల్లో ఎలా వ్యూహాలు రచిస్తావో.. ఏం చేస్తావో అవన్నీ తెల్వదు గెలవాల్సిందే’ ఇదొక్కటే పీకేకు పదే పదే కేసీఆర్ చెప్పారట. సోమవారం నాడు ఎన్నికల ప్రచారం ముగించుకున్న కేసీఆర్ నేరుగా ప్రగతి భవన్‌కు వెళ్లారట. అప్పటికే పీకే రెడీగా ఉండటంతో మూడు గంటలపాటు ఏం చేద్దాం..? ఎలా ముందుకెళ్దాం..? ఏం చేసైనా సరే హ్యాట్రిక్ కొట్టాల్సిందే..? అని చెప్పారట. ఇప్పుడిదే తెలంగాణలో గల్లీ నుంచి ఢిల్లీ వరకూ నడుస్తున్న చర్చ. సోషల్ మీడియాలో అయితే ఇదే రచ్చ.

KCR-And-PK.jpg

ఎందుకింత భయం..?

వాస్తవానికి తెలంగాణ ఎన్నికలపై ఇప్పటి వరకూ ప్రముఖ సంస్థలు రిలీజ్ చేసిన సర్వేలన్నీ దాదాపు కాంగ్రెస్‌కు అనుకూలంగానే వచ్చాయి. ఇది మొదట బీఆర్ఎస్ అగ్రనేతలు సీరియస్‌గా తీసుకోకపోయినప్పటికీ గ్రౌండ్‌ లెవల్‌లో, ఇంటెలిజెన్స్‌తో చేయించిన సర్వేల్లో షాకింగ్ నిజాలు వెలుగులోకి వచ్చాయట. కాంగ్రెస్‌ విజయం వైపు దూసుకెళ్తోందని వ్యక్తిగ సర్వేల్లో తేలిందట. దీంతో కారు పార్టీ పెద్దలకు నిద్ర పట్టట్లేదట. ఇక ఉన్న ఈ కొద్ది కాలాన్ని ఎలా వినియోగించుకోవాలి..? ఏం చేయాలి..? అని ముఖ్యనేతలతో కేసీఆర్ చర్చించి.. అనంతరం ఇక ఉన్నది వన్ అండ్ ఓన్లీ ప్రశాంత్ కిశోర్ మాత్రమేనన్న నిర్ణయానికి వచ్చారట. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పీకేని హైదరాబాద్‌కు పిలిపించాలని గులాబీ బాస్ ఆదేశించడంతో అప్పటికప్పుడు ఐప్యాక్‌ టీమ్‌ను సంప్రదించడం ఇవన్నీ నిమిషాల్లో జరిగిపోయాయట. సోమవారం నాడు ప్రశాంత్ కిశోర్ ప్రగతిభవన్‌కు రావడంతో మూడు గంటలపాటు ఏకాంతంగా మాట్లాడినట్లు తెలియవచ్చింది. ‘ఈ కొద్దిరోజులు మీ సేవలు మాకు అవసరం.. గెలిపించండి.. తర్వాత ఏమున్నా మాట్లాడుకుందాం’ అని పీకేతో పదే పదే కేసీఆర్ అన్నారట. ఆ తర్వాత కేటీఆర్, హరీష్ రావు, కవిత కూడా ప్రత్యేకంగా భేటీ అయ్యి పలు విషయాలు చర్చించినట్లుగా సమాచారం. దీంతో కాస్త టైమ్ ఇవ్వాలని కోరిన పీకే ఫైనల్‌గా ఓకే అన్నట్లుగా తెలిసింది. పీకే కాదనలేనంతగా భారీ ఆఫర్ చేయడంతో ఓకే అన్నట్లు తెలియవచ్చింది. కాగా రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈయన బీజేపీకి పనిచేయబోతున్నారు. మరోవైపు.. పీకే శిష్యుడు సునీల్ కనుగోలు కాంగ్రెస్‌కు వ్యూహకర్తగా పనిచేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి ఈయన కారణమని పార్టీ శ్రేణులు చెప్పుకుంటూ ఉంటాయి.

congress.jpg

నాడు వద్దు.. నేడు ముద్దు!

పీకే గురించి ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఈయన ఏ పార్టీకి వ్యూహకర్తగా ఉంటారో ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన రాష్ట్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఒకట్రెండు మాత్రమే ఫెయిల్యూర్స్ ఉన్నాయంతే. దేశవ్యాప్తంగా ఎన్నో పార్టీలను గద్దె ఎక్కించిన పీకేకి పేరు ప్రఖ్యాతలు మార్మోగాయి. అందుకే బీఆర్ఎస్ కూడా తమకు సేవలు అందించాలని పీకేను కోరింది. అయితే ఆ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రశాంత్ కిశోర్ డ్రాప్ అయ్యారు. దీంతో సొంతంగానే బీఆర్ఎస్ ప్రచారం చేసుకుంది. అయితే ఎటు చూసిన కాంగ్రెస్ గాలి వీస్తుండటం.. సర్వేలు అన్నీ కాంగ్రెస్‌కే అనుకూలంగా రావడం.. ఇవన్నీ కేసీఆర్‌కు నిద్రలేకుండా చేశాయట. ఆ తర్వాత మళ్లీ పీకేను తీసుకొచ్చారట. నాడు వద్దన్న పీకేనే.. నేడు ముద్దు అన్నట్లుగా పరిస్థితన్న మాట. సో.. ఇప్పుడు బీఆర్ఎస్‌కు పీకే సేవలు అందిస్తున్నారన్నట. రాజకీయాలంటే ఆసక్తి ఉన్న గురురాజ్ అంజన్ అనే వ్యక్తి ఈ విషయాన్ని తన ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చారు. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ ట్వీట్ గురించే రచ్చ రచ్చ జరుగుతోంది. ఇంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ నేతలు కనీసం ఖండించడం కానీ.. అవుననే మాట రాకపోవడం ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది. పీకే బీఆర్ఎస్ పనిచేస్తున్న విషయం నిజమే అయితే తన వ్యూహాలకు పదునుపెట్టి ‘కారు’ పార్టీ సారును మరోసారి అధికారంలోకి రప్పిస్తారో.. లేకుంటే ముందుగా వస్తున్నట్లు సర్వేలన్నీ అక్షరాలా నిజమై కాంగ్రెస్‌ విజయదుందుభీ మోగిస్తుందో చూడాలి మరి.

PK.jpg

మరిన్ని తెలంగాణ ఎన్నికల వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-21T22:29:07+05:30 IST