Viral Video: వామ్మో! బుల్ ఫైట్ చూసేందుకు వెళ్లిన యువతిపై ఎద్దు దాడి.. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా వదలకుండా..

ABN , First Publish Date - 2023-10-01T16:39:17+05:30 IST

జల్లికట్టు పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆవేశంగా ఉన్న ఎద్దులను లొంగదీసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో కొందరికి గాయాలు కూడా అవుతుంటాయి. అయినా లెక్కచేయకుండా పోటీలోకి దిగుతుంటారు. అలాగే ..

Viral Video: వామ్మో! బుల్ ఫైట్ చూసేందుకు వెళ్లిన యువతిపై ఎద్దు దాడి.. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా వదలకుండా..

జల్లికట్టు పోటీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆవేశంగా ఉన్న ఎద్దులను లొంగదీసుకునేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. ఈ సమయంలో కొందరికి గాయాలు కూడా అవుతుంటాయి. అయినా లెక్కచేయకుండా పోటీలోకి దిగుతుంటారు. అలాగే వివిధ దేశాల్లో బుల్ ఫైట్ పేరుతో పెద్ద పెద్ద ఎద్దులు, దున్నపోతులను నియంత్రించడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి సమయాల్లోనూ కొన్నిసార్లు ఊహించని ప్రమాదాలు జరుగుతుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్లాక్ డ్రెస్‌లో ఉన్న యువతిని ఓ ఎద్దు టార్గెట్ చేస్తుంది. తప్పించుకోవాలని ఎంత ప్రయత్నించినా వదలకుండా చివరకు ఏం చేసిందో చూడండి..

సోషల్ మీడియాలో బుల్ ఫైట్ వీడియో (Viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. జల్లికట్టు, బుల్ ఫైట్ తరహా క్రీడ జరుగుతున్న ప్రాంతంలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చాలా మంది ఈ పోటీలను తిలకిస్తూ ఉంటారు. ఓ బ్లాక్ డ్రెస్ వేసుకున్న కూడా వారితో పాటూ అక్కడే చూస్తూ ఉంటుంది. అయితే మధ్యలో ఆమె ఉన్నట్టుండి మైదానంలోకి వెళ్తుంది. సమీపానికి వెళ్లగానే యువతిని (young woman) ఎద్దు టార్గెట్ చేస్తుంది. ఉన్నట్టుండి దాడి చేయడానికి ప్రయత్నించడంతో షాకైన యువతి.. అక్కడి నుంచి పారిపోతుంది. వేగంగా పరుగెత్తి ఇటుప గేటు నుంచి ఇవతలికి దాటేందుకు ప్రయత్నిస్తుంది.

Viral Video: డేగ కన్ను పడిందంటే ఇలాగే ఉంటుంది మరి.. పామును ఎంత టెక్నిక్‌గా పట్టుకుందో జూమ్‌ చేసి చూస్తే..

అయితే అప్పటికే ఆవేశంతో ఉన్న ఎద్దు వేగంగా వచ్చి యువతిని (bull attack on young woman) కొమ్ములతో పైకి ఎత్తి ధబేల్‌మని కింద పడేస్తుంది. అయితే ఇనుప గేటు ఇవతల ఉన్న వారు యువతిని గట్టిగా పట్టుకుని లోపలికి లాక్కుంటారు. సమయానికి వారు స్పందించకపోతే పెద్ద ప్రమాదం జరిగుండేది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘వామ్మో! కొంచెం ఆలస్యం అయ్యుంటే ఎంత ఘోరం జరిగుండేదో’’.. అని కొందరు, ‘‘ఇలాంటి సమయంలో లోపలికి వెళ్లడం అవసరమా..’’.. అని మరికొందరు, ‘‘ఎవరూ ఇలాంటి సాహసాలు చేయొద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 41వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: సినిమా తరహా షాట్స్ కోసం రైలు పట్టాల మీదకు వెళ్లిన యువకుడు.. తీరా ఫోన్‌లో రికార్డ్ చేస్తుండగా..

Updated Date - 2023-10-01T16:39:17+05:30 IST