Viral Video: ఈ ఎలుగుబంటి ఏకాగ్రతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

ABN , First Publish Date - 2023-04-26T18:37:23+05:30 IST

చాలా సందర్భాల్లో జంతువులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ఏకాగ్రత లేకపోవడం వల్ల చాలా మంది తమ ఆశాయలను నెరవేర్చుకోవడంలో విఫలం అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో..

Viral Video: ఈ ఎలుగుబంటి ఏకాగ్రతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

చాలా సందర్భాల్లో జంతువులను చూసి మనుషులు ఎంతో నేర్చుకోవాల్సి ఉంటుంది. విధి నిర్వహణలో ఏకాగ్రత లేకపోవడం వల్ల చాలా మంది తమ ఆశాయలను నెరవేర్చుకోవడంలో విఫలం అవుతుంటారు. ఇలాంటి సందర్భాల్లో చేస్తున్న పనిని ఎంత ఏకాగ్రతగా చేస్తున్నామన్నది చాలా ముఖ్యం. ప్రస్తుతం వైరల్ వీడియోనే ఇందుకు నిదర్శనం. ఓ ఎలుగుబంటి తన వేట కోసం ఎంతో ఏకాగ్రతతో ఎదురు చూస్తుంది. చివరకు తన వేటను విజయవంతంగా పూర్తి చేసుకుంటుంది. ఈ వీడియో చూసి ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా (businessman Anand Mahindra) ఫిదా అయ్యారు. వెంటనే ఆ వీడియోను తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఫేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్‌గా మారింది.

సోషల్ మీడియాలో ఓ ఎలుగుబంటి వీడియో తెగ చెక్కర్లు (Bear viral videos) కొడుతోంది. ఆకలితో ఉన్న ఎలుగుబంటి వేగంగా పారుతున్న ఓ నది ఒడ్డున వేట కోసం వేచి చూస్తూ ఉంటుంది. నీటి ప్రవాహం వేగంగా ఉడడంతో చేపలు పట్టుకోవడం కష్టమవుతుంది. అయినా ఎలాగైనా వేటను పూర్తి చేయాల్సిందే.. అన్నట్లుగా తదేకంగా నీటిలోకి చూస్తూ ఉంటుంది. ‘‘ఎంత లోతులో ఉన్నా సరే.. ఈ రోజు చేపలను వదిలే ప్రసక్తే లేదు’’.. అన్నట్లుగా నీటిపైనే దృష్టి పెడుతుంది. ఈ క్రమంలో కాసేపటి తర్వాత చేప కనపడగానే క్షణాల వ్యవధిలో నీటిలోకి మునిగి (bear hunted fish) .. అంతే వేగంగా చేపను నోట కరుచుకుని పైకి లేస్తుంది.

Viral Video: తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. ఇదిగో ఈ కుర్రాడికి అదే జరిగింది..!

‘‘హమ్మయ్య! ఈ రోజు టార్గెట్ పూర్తయింది.. పక్కకు వెళ్లి ప్రశాతంగా తినేయాలి’’.. అని అనుకుంటున్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఈ ఘటనను అక్కడే ఉన్న కొందరు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన ఆనంద్ మహీంద్రా ఫిదా అయ్యారు. ‘‘ధ్యానం. ఏకాగ్రత ఉంటే ఏ పనిలో అయినా విజయం సొంత అవుతుంది’’.. అని పేర్కొంటూ వీడియోను తన ట్విట్టర్ ఖాతా (Twitter account) ద్వారా షేర్ చేశారు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఈ ఎలుగు బంటి టాలెంట్ సూపర్’’.. అంటూ కొందరు, ‘‘ఈ ఎలుగుబంటికి ఎంత ఏకాగ్రత’’.. అంటూ మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వాషింగ్ మెషిన్‌లో ఇరుక్కున్న మహిళను.. చిన్న టెక్నిక్‌తో ఈ పోలీసు ఎలా కాపాడాడో చూడండి..

Updated Date - 2023-04-28T21:06:54+05:30 IST