Share News

Viral Video: కేవలం రూ.5తో రుచికరమైన భోజనం.. అయితే తిన్న తర్వాత అతడు ఇచ్చిన ట్విస్ట్ ఏంటో తెలిస్తే..

ABN , Publish Date - Dec 20 , 2023 | 03:14 PM

చాలా మంది వ్యాపారస్తులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను ఇస్తుంటారు. ఒకటి కొంటే మరోటి ఫ్రీ అంటూ కొందరు, పండుగ డిస్కౌంట్ల పేరుతో మరికొందరు, అలాగే ఇంకొందరు..

Viral Video: కేవలం రూ.5తో రుచికరమైన భోజనం.. అయితే తిన్న తర్వాత అతడు ఇచ్చిన ట్విస్ట్ ఏంటో తెలిస్తే..

చాలా మంది వ్యాపారస్తులు కస్టమర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ఆఫర్లను ఇస్తుంటారు. ఒకటి కొంటే మరోటి ఫ్రీ అంటూ కొందరు, పండుగ డిస్కౌంట్ల పేరుతో మరికొందరు, అలాగే ఇంకొందరు వినూత్న టెక్నిక్‌లతో ప్రచారం చేస్తూ అందరినీ ఆకట్టుకోవడం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో ఇలాంటి వ్యాపారస్తులకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వ్యక్తికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. కేవలం రూ.5కే రుచికరమైన భోజనం అని చెప్పడంతో అంతా క్యూకట్టారు. అయితే తిన్న తర్వాత సదరు వ్యాపారి ఇచ్చిన ట్విస్ట్ ఏంటో తెలిశాక.. షాక్ అయ్యారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ యువకుడు రోడ్డ పక్కన స్టాండ్‌పై వివిధ రకాల కూరలు, భోజనం ఏర్పాటు చేసి.. ప్లేటు (Five rupees meal) రూ.5లే అని ప్రకటించాడు. దీంతో చాలా మంది అక్కడికి క్యూ కట్టారు. ప్లేటులో రకరకాల కూరలతో పాటూ చపాతీతో కూడిన భోజనాన్ని అందించాడు. ఇంతవరకూ బాగానే ఉన్నా.. ఇక్కడే అసలు ట్విస్ట్ ఇచ్చాడు. భోజనం తినే ముందు రూ.5లు చెల్లించి, తిన్న తర్వాత రూ.55లు చెల్లించండి అనగానే.. ఒక్కసారిగా అంతా అవాక్కయ్యారు.

Viral Video: పెట్రోల్ బంక్‌‌లో విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. పెట్రోలు పట్టే క్రమంలో సిబ్బంది చేసిన నిర్వాకం..

అయితే అతను అందించిన భోజనానికి ఆ రేటు సమజంసం కావడంతో ఎవరూ విమర్శించలేదు. అయితే సదరు వ్యాపారి తెలివితేటలకు అంతా ఆశ్చర్యపోయారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ వ్యాపారి తెలివితేటలు మామూలుగా లేవు’’.. అంటూ కొందరు, ‘‘ఆ భోజనానికి రూ.60 ఇవ్వడం సమంజసమే’’.. అంటూ మరికొందరు, ‘‘భవిష్యత్తులో ఇతను పెద్ద వ్యాపారవేత్త అవుతాడు’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తు్న్నారు.

Viral Video: పెళ్లిలో వధూవరుల ముందే టెంకాయతో తల బాదుకున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..

Updated Date - Dec 20 , 2023 | 03:15 PM