Viral Video: పెట్రోల్ బంక్‌లో విదేశీ యువతికి షాకింగ్ అనుభవం.. పెట్రోలు పట్టే క్రమంలో సిబ్బంది చేసిన నిర్వాకం..
ABN , Publish Date - Dec 19 , 2023 | 08:16 PM
ప్రస్తుతం సోషల్ మీడియాలో యుగంలో ట్రావెలింగ్ పేరుతో కొందరు రీల్స్, వీడియోలు చేస్తూ అనేక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఇక్కడి వాళ్లు విదేశాలను సందర్శిస్తుంటే.. మరోవైపు విదేశీయులు కూడా భారత దేశంలో పర్యటించడం సర్వసాధారణమైంది. అయితే..
ప్రస్తుతం సోషల్ మీడియాలో యుగంలో ట్రావెలింగ్ పేరుతో కొందరు రీల్స్, వీడియోలు చేస్తూ అనేక ప్రాంతాలను సందర్శిస్తుంటారు. ఇక్కడి వాళ్లు విదేశాలను సందర్శిస్తుంటే.. మరోవైపు విదేశీయులు కూడా భారత దేశంలో పర్యటించడం సర్వసాధారణమైంది. అయితే ఇలాంటి సందర్భాల్లో ప్రధానంగా మహిళలకు అనేక ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తాజాగా, ఓ రష్యన్ యువతికి ఇలాగే జరిగింది. స్నేహితుడితో కలిసి పెట్రోల్ బంక్‌కు వెళ్లిన యువతికి షాకింగ్ అనుభవం ఎదురైంది. పెట్రోలు పట్టే క్రమంలో సిబ్బంది చేసిన నిర్వాకం.. చివరికి పోలీసుల వరకూ వెళ్లింది. ఈ వీడియో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది.
రాజస్థాన్ జైపూర్‌లో (Rajasthan Jaipur) ఈ ఘటన చోటు చేసుకుంది. ఓ యూట్యూబర్ తన రష్యన్ స్నేహితురాలైన విక్టోరియా అనే యువతితో (Russian woman) కలిసి రాజస్థాన్‌లోని అనేక పర్యాటక ప్రాంతాల్లో పర్యటిస్తున్నాడు. ఈ క్రమంలో అతను నవంబర్ 7న జైపూర్ వచ్చాడు. రాత్రి సమయంలో హోటల్‌లో భోజనం చేసిన అనంతరం తన స్నేహితురాలితో కలిసి బైకుపై బయలుదేరాడు. మధ్యలో పెట్రోల్ పట్టించుకోవడానికి ఓ బంక్‌కు వెళ్లారు. అయితే రష్యన్ యువతికి ఊహించని అనుభవం ఎదురైంది. పెట్రోల్ పట్టే క్రమంలో సదరు సిబ్బంది.. యువతిపై కన్నేశాడు. ఓ వైపు పెట్రోలు పడుతూ మరోవైపు ఆమెను (Indecent behavior towards Russian woman) పదే పదే తాకడం మొదలెట్టాడు. ఇలా మూడు సార్లు తాకడంతో యువతికి విషయం అర్థమైంది.
యువతి వెంటనే ఈ విషయాన్ని తన స్నేహితుడికి తెలియజేసింది. దీంతో పెట్రోల్ బంక్ సిబ్బందికి, యూట్యూబర్‌కు వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు ఆ యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అక్కడికి చేరుకున్న పోలీసులు.. యువతిని విచారించారు. పెట్రోల్ పట్టే క్రమంలో పొరపాటున తాకానని, కావాలని చేయలేదంటూ సిబ్బంది చెప్పుకొచ్చారు. చివరకు పోలీసులు కలుగుజేసుకుని పెట్రోల్ బంక్ సిబ్బందితో యువతికి క్షమాపణలు చెప్పిస్తారు. దీంతో గొడవ సర్దుమణుగుతంది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘విదేశీయులను గౌరవించడం మన సంస్కారం’’.. అంటూ కొందరు, ‘‘ఇలా చేయడం చాలా తప్పు’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలి’’.. అంటూ ఇంకొదరు కామెంట్లు చేస్తున్నారు.
Viral Video: పెళ్లిలో వధూవరుల ముందే టెంకాయతో తల బాదుకున్న యువకుడు.. చివరికి ఏం జరిగిందో చూడండి..