Share News

Viral Video: ఈ పానీపూరీ విక్రేత నెలవారీ ఆదాయం తెలిస్తే.. ఉద్యోగులు కూడా షాక్ అవ్వాల్సిందే..

ABN , Publish Date - Dec 14 , 2023 | 08:39 PM

కొందరు చిరు వ్యాపారస్తులు తమ తెలివితేటలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ లాభాలను ఆర్జిస్తుంటారు. ఇంకొందరైతే సంపాదనలో ఉద్యోగుస్తులు కూడా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి ..

Viral Video: ఈ పానీపూరీ విక్రేత నెలవారీ ఆదాయం తెలిస్తే.. ఉద్యోగులు కూడా షాక్ అవ్వాల్సిందే..

కొందరు చిరు వ్యాపారస్తులు తమ తెలివితేటలతో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ లాభాలను ఆర్జిస్తుంటారు. ఇంకొందరైతే సంపాదనలో ఉద్యోగుస్తులు కూడా అవాక్కయ్యేలా చేస్తుంటారు. ఇలాంటి వ్యాపారులకు సంబంధించిన వార్తలు, ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వ్యాపారికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. పానీపూరీ వ్యాపారి నెల వారీ ఆదాయం తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పారీపూరీ (Paripuri) విక్రయిస్తున్న ఓ యువకుడి ఆదాయం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఓ యూట్యూబర్ (YouTuber) ఆ వ్యాపారి వద్దకు వెళ్లి మాటామాటా కలిపి మధ్యలో అతడి ఆదాయం గురించి అడుగుతాడు. ఇందుకు సమాధానంగా అతను రూ.2,500లు అంటూ చెబుతాడు. ఇందుకు యూట్యూబర్ ‘‘ఇది నెల ఆదాయమా’’.. అని అడుగుతాడు. దీనికి వ్యాపారి.. ‘‘కాదు.. రోజు ఆదాయం’’.. అని చెప్పగానే సదరు యూట్యూబర్ షాక్ అవుతాడు. దీన్ని బట్టి అతను నెలకు రూ.75,000లు సంపాదిస్తున్నాడు.. అంటూ సోషల్ మీడియాలో వీడియో షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వావ్! ఈ వ్యాపారి టాలెంట్ అమోఘం’’.. అంటూ కొందరు, ‘‘బాగా కష్టపడుతున్నాడు’’.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 17లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral: యువతి పిలవగానే డాన్స్‌ ఇరగదీసిన పోలీసు.. అయితే తర్వాత జరిగింది తెలుసుకుని ఖంగుతిన్నాడు..

Updated Date - Dec 14 , 2023 | 08:39 PM