Share News

Viral Video: ఇదేందయ్యా.. ఇది... లేజర్ లైటుతో మొసలికే చుక్కలు చూపించాడుగా...

ABN , First Publish Date - 2023-12-12T20:48:54+05:30 IST

క్రూర జంతువులను చూసి భయపడే వారు కొందరైతే.. మరికొందరు అదే క్రూర జంతువులతో స్నేహం చేస్తుంటారు. ఇంకొందరు తమ తెలివితేటలతో పెద్ద పెద్ద జంతువులను సైతం ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఇలాంటి...

Viral Video: ఇదేందయ్యా.. ఇది...  లేజర్ లైటుతో మొసలికే చుక్కలు చూపించాడుగా...

క్రూర జంతువులను చూసి భయపడే వారు కొందరైతే.. మరికొందరు అదే క్రూర జంతువులతో స్నేహం చేస్తుంటారు. ఇంకొందరు తమ తెలివితేటలతో పెద్ద పెద్ద జంతువులను సైతం ముప్పుతిప్పలు పెడుతుంటారు. ఇలాంటి ఘటనలు చూసినప్పుడు కొన్నిసార్లు ఆశ్చర్యం కలిగితే.. మరికొన్నిసార్లు నవ్వు వస్తుంటుంది. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. ఓ వ్యక్తి లేజర్ లైటుతో మొసలికే చుక్కలు చూపించాడు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తికి లేజర్ లైట్ (Laser light) చూడగానే వెంటనే ఓ ఐడియా వచ్చింది. దాంతో ఏకంగా మొసలితో గేమ్ ఆడుకోవాలని అనుకున్నాడు. ఓ చెరువు వద్దకు వెళ్లి మొసలి కోసం అన్వేషించాడు. చివరకు నీటిపై లేజర్ లైట్ వేయగానే.. లోపలి నుంచి మొసలి (crocodile) ఒక్కసారిగా పైకి వచ్చింది. ‘‘ఏదో రంగు రంగుల చేప దొరికింది’’.. అన్నట్లుగా లైటు వైపు ఆశగా వచ్చింది.

Viral Video: అనుకోకుండా తారసపడ్డ రెండు కోతులు.. ఎలా పలకరించుకున్నాయో చూస్తే.. అవాక్కవ్వాల్సిందే...

మొసలి సమీపానికి రాగానే లేటర్ లైట్‌ను దూరంగా జరపడంతో.. మొసలి కూడా దాని వైపు వేగంగా కదిలింది. ఇలా చాలా సేపు లైటుతో మొసలిని ఆడుకున్నాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఎలా వస్తాయయ్యా... ఇలాంటి ఐడియాలు’’.. అని కొందరు, ‘‘మొసలికే చుక్కలు చూపించాడుగా’’.. అని మరికొందరు, ఫన్నీ ఫన్నీ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: పెళ్లిలో వధువు డాన్స్ చేస్తుండగా.. సడన్‌గా ఈ డ్రమ్మర్ చేసిన పనికి అంతా షాక్..

Updated Date - 2023-12-12T20:48:55+05:30 IST