Share News

Viral Video: పెళ్లిలో వధువు డాన్స్ చేస్తుండగా.. సడన్‌గా ఈ డ్రమ్మర్ చేసిన పనికి అంతా షాక్..

ABN , First Publish Date - 2023-12-12T18:41:50+05:30 IST

వివాహ ఘటనల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం.. అవి ఫొటోలు, వీడియోల రూపంలో ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవడం సర్వసాధారణమైంది. వివాహ మంటపాల్లోకి వధూవరుల ఎంట్రీ, స్నేహతులతో కలిసి డాన్సులు తదితర ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వీటిలో...

Viral Video: పెళ్లిలో వధువు డాన్స్ చేస్తుండగా.. సడన్‌గా ఈ డ్రమ్మర్ చేసిన పనికి అంతా షాక్..

వివాహ ఘటనల్లో విచిత్ర ఘటనలు చోటు చేసుకోవడం.. అవి ఫొటోలు, వీడియోల రూపంలో ఇట్టే సోషల్ మీడియాలో వైరల్ అవడం సర్వసాధారణమైంది. వివాహ మంటపాల్లోకి వధూవరుల ఎంట్రీ, స్నేహతులతో కలిసి డాన్సులు తదితర ఘటనలకు సంబంధించిన వీడియోలు తెగ చక్కర్లు కొడుతుంటాయి. వీటిలో కొన్ని అందరికీ నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటాయి. తాజాగా, ఓ వధువుకు సంబంధించిన వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. పెళ్లిలో వధువు డాన్స్ చేస్తుండగా.. మధ్యలో సడన్‌గా డ్రమ్మర్ చేసిన పనకి అంతా షాక్ అయ్యారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. పెళ్లిలో వధూవరులతో పాటూ స్నేహితులంతా కలిసి (Bride and groom dance) డాన్సులు వేస్తున్నారు. వీరి డాన్స్ చూసి అతిథులంతా ఎంజాయ్ చేస్తున్నారు. అయితే మధ్యలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. అప్పటిదాకా అందరితో కలిసి డాన్స్ చేస్తున్న వధువు.. తర్వాత పక్కన డ్రమ్ము వాయిస్తున్న వ్యక్తి వద్దకు వెళ్లింది. డ్రమ్ముపై కూర్చుని మరీ డాన్స్ చేయడం మొదలెట్టింది. వధువును డ్రమ్ముపై కూర్చోబెట్టుకున్న వ్యక్తి.. బ్యాలెన్స్ చేస్తూ డ్రమ్ము వాయిస్తున్నాడు.

Viral Video: కేఫ్‌లో యువతీయువకుల మధ్య వింత సమస్య.. తీరా బయటికొచ్చే సమయంలో..

అయితే ఈ క్రమంలో ఆమె డాన్స్ చేస్తూ ముందుకు పడబోయింది. దీంతో డ్రమ్మర్.. ఆమెను పట్టుకుని గట్టిగా వెనక్కు లాగాడు. అతడు అలా చేయడంతో వధువు కూడా అవాక్కవుతుంది. పక్కన ఉన్న వారంతా నోరెళ్లబెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ డ్రమ్మర్ లక్కీ చాన్స్ కొట్టాడు’’.. అని కొందరు, ‘‘వధువు డాన్స్ సూపర్’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.50లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: తనకు సంబంధం లేకున్నా.. చొరవ తీసుకుని మరీ.. ఈ ఎయిర్ హోస్టెస్ చేసిన పని చూడండి..

Updated Date - 2023-12-12T18:41:52+05:30 IST