Viral Video: మీరు రోజూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా.. అయితే ఈ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే షాకవుతారు..

ABN , First Publish Date - 2023-07-29T15:44:13+05:30 IST

వృత్తే దైవంగా భావించే వారు ఉన్న నేటి సమాజంలో అదే వృత్తిని అడ్డుపెట్టుకుని అంతా అసహ్యించుకునే పనులు చేసే వారు కూడా ఉంటారు. పైత్యమో, పైశాచికత్వమో తెలీదు గానీ.. కొందరి మరీ దారుణంగా ఆలోచిస్తుంటారు. ఉమ్మి వేసి చపాతీలు తయారు చేయడం, మురుగు నీటితో ..

Viral Video: మీరు రోజూ ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్ చేస్తుంటారా.. అయితే ఈ డెలివరీ బాయ్ చేసిన పని చూస్తే షాకవుతారు..

వృత్తే దైవంగా భావించే వారు ఉన్న నేటి సమాజంలో అదే వృత్తిని అడ్డుపెట్టుకుని అంతా అసహ్యించుకునే పనులు చేసే వారు కూడా ఉంటారు. పైత్యమో, పైశాచికత్వమో తెలీదు గానీ.. కొందరి మరీ దారుణంగా ఆలోచిస్తుంటారు. ఉమ్మి వేసి చపాతీలు తయారు చేయడం, మురుగు నీటితో పానీపూరీ చేయడం, ఆఖరికి కూరగాయలపై మూత్ర విసర్జన చేస్తూ పట్టుబడిన వారిని చాలా మందిని చూశాం. ఇలాంటి వ్యక్తులకు సంబంధించిన వీడియోలు తరచూ నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఫుడ్‌ను డెలివరీ చేసే క్రమంలో అతడి నిర్వాకం చూసి అంతా అవాక్కవుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ డెలివరీ బాయ్‌కి సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. బహ్రెయిన్‌లో (Bahrain) ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఓ డెలివరీ బాయ్ (Food Delivery boy) ఫుడ్ డెలివరీ చేసే క్రమంలో ఉన్నట్టుండి బైకును రోడ్డు పక్కన ఆపాడు. తర్వాత బాక్స్‌ తెరచి అందులోని పార్సిల్‌ను ఓపెన్ చేశాడు. అక్కడే నిలబడి అందలోని ఆహారాన్ని తింటూ ఉన్నాడు. తర్వాత జ్యూస్ బాటిల్స్‌ను కూడా టేస్ట్ చేశాడు. ఈ ఘటనను దూరంగా ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

ఈ వీడియో వైరల్ అవడంతో కంపెనీ యాజమాన్యం స్పందించింది. అది క్యాన్సిల్ చేసిన ఆర్డర్ అని తెలిసిందని, అయినా తమ డెలివరీ బాయ్ చేసింది తప్పేనని.. పూర్తి విచారణ పూర్తయ్యే వరకూ అతన్ని సస్పెండ్ చేసినట్లు పేర్కొంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై కొందరు నెటిజన్లు తప్పు అని చెబుతుండగా.. మరికొందరు డెలివరీ బాయ్‌కే మద్దతు ఇస్తున్నారు. ‘‘ఇలాంటి పనులు చేయడం సరైంది కాదు’’.. అని కొందరు, ‘‘ఆకలి ఎంత పనైనా చేయిస్తుంది’’.. అని ఇంకొందరు, ‘‘తాను చేస్తుంది తప్పయితే.. అలా బహిరంగంగా ఎందుకు తింటాడు’’.. అరి మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

Updated Date - 2023-07-29T15:50:10+05:30 IST