Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

ABN , First Publish Date - 2023-07-29T15:00:09+05:30 IST

ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన ఆప్తుడు. కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి వారు రోజు రోజుకూ కనుమరుగవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. అందులోనూ పెంపుడు కుక్కలు చాలా చాలా మేలని అనిపిస్తుంది. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు..

Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునేవాడే నిజమైన ఆప్తుడు. కానీ ప్రస్తుత సమాజంలో అలాంటి వారు రోజు రోజుకూ కనుమరుగవుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల కంటే జంతువులే ఎంతో మేలని అనిపిస్తుంటుంది. అందులోనూ పెంపుడు కుక్కలు చాలా చాలా మేలని అనిపిస్తుంది. ఒక్క ముద్ద అన్నం పెడితే చాలు.. జీవితాంతం ఇంటిని కాపలా కాస్తుంటాయి. ఇందుకు ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోనే నిదర్శనం. ఆ వ్యక్తికి అప్పటిదాకా తన పెంపుడు కుక్కల విలువ తెలియలేదు. అయితే ఒకే ఒక్క సంఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర (Maharashtra) నాసిక్ పరిధి అద్గావ్ షివార్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ స్థానికంగా ఉన్న ఓ ఇంట్లోకి ( tiger entered the house) చిరుత పులి ప్రవేశించింది. ప్రహరీ నుంచి నేరుగా ఇంటి ముంగిట్లోకి వస్తుంది. హాలు గేటు తెరచి ఉండడంతో లోపలికి వెళ్తుంది. అటూ ఇటూ చూసి అక్కడే పడుకుని ఉన్న కుక్కను టార్గెట్ చేస్తుంది. మెల్లగా దగ్గరికి వెళ్లి కుక్క మెడను గట్టిగా పట్టుకుంటుంది. దీంతో కుక్క మొరుగుతూ దాన్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. అక్కడే కాస్త దూరంలో పడుకుని ఉన్న ఇంకో కుక్క గమనించి.. క్షణం ఆలస్యం చేయకుండా (Dog attack on tiger) పులి మీదకు దూకుతుంది. దీంతో భయపడ్డ పులి కుక్కను వదిలి బయటకు పారిపోతుంది.

Viral Video: బుల్లెట్ బండి ఉంది కదా అని మరీ ఈ పైత్యమేంటీ.. ఇతడి నిర్వాకంపై మండిపడుతున్న నెటిజన్లు.. చివరకు ఏమైందంటే..

అయినా ఆ కుక్కలు పారిపోకుండా పులిని.. ఆ పరిసరాల నుంచి తరిమికొట్టేందుకు వెంబడిస్తాయి. దీంతో మరింత భయపడ్డ పులి.. ప్రాణ భయంతో తిరుగుతూ ఎలా వెళ్లాలో అర్థం కాక.. కాసేపు అటూ ఇటూ కంగారుగా తిరుగుంది. తర్వాత ‘‘బతికిపోయానురా.. బాబూ’’.. అనుకుంటూ అక్కడి నుంచి పలాయనం చిత్తగిస్తుంది. ఆ సమయంలో కుక్కలు లేకుంటే పెద్ద ప్రమాదమే జరిగి ఉండేది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కుక్కలు లేకుండా మనుషులు మాత్రమే ఉండుంటే ఘోరం జరిగి ఉండేది’’.. అంటూ కొందరు, ‘‘గ్రామ సింహాలా.. మజాకా..’’.. అని ఇంకొందరు, ‘‘ఇలాంటి కుక్క ఒక్కటి ఉన్నా చాలు’’.. అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 76వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

Updated Date - 2023-07-29T15:00:09+05:30 IST