Funny Video: ఈ యువతి జుట్టు ఇలా వెరైటీగా ఉండేసరికి.. తినొచ్చనుకున్న ఒంటె.. ఆమె దగ్గరకు రాగానే సడన్‌గా అటాక్.. చివరకు..!

ABN , First Publish Date - 2023-07-27T16:07:25+05:30 IST

జూ సందర్శన సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. జంతువులను తిలకించే క్రమంలో కొన్నిసార్లు సందర్శకులు అత్యుత్యాహం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి పులులు, సింహాలతో ఆటలు ఆడుతుంటారు. అయితే ఇలాంటి ...

Funny Video: ఈ యువతి జుట్టు ఇలా వెరైటీగా ఉండేసరికి.. తినొచ్చనుకున్న ఒంటె.. ఆమె దగ్గరకు రాగానే సడన్‌గా అటాక్.. చివరకు..!

జూ సందర్శన సమయాల్లో కొన్నిసార్లు ఊహించని ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. జంతువులను తిలకించే క్రమంలో కొన్నిసార్లు సందర్శకులు అత్యుత్యాహం ప్రదర్శిస్తుంటారు. మరికొందరు మరో అడుగు ముందుకేసి పులులు, సింహాలతో ఆటలు ఆడుతుంటారు. అయితే ఇలాంటి పిచ్చి చేష్టలు కొన్నిసార్లు ప్రమాదకరంగా మారుతుంటాయి. ఈ తరహా ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ మహిళకు సంబంధించిన ఫన్నీ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. యువతి జుట్టు వెరైటీగా ఉండడం చూసి ఓ ఒంటె తినేందుకు ప్రయత్నం చేసింది. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) హల్‌చల్ చేస్తోంది. పిల్లాడిని ఎత్తుకుని జూకు వెళ్లిన మహిళకు (woman) ఊహించని అనుభవం ఎదురైంది. జంతువులను చూసే క్రమంలో ఓ ఒంటె వద్దకు వెళ్తుంది. అయితే మరింత దగ్గరగా చూడాలనే ఉద్దేశంతో కంచె వద్దకు వెళ్తుంది. ఆమె జుట్టు రింగు రింగులు తిరిగి వెరైటీగా ఉండడంతో.. ఒంటె కంటికి తినే పదార్థంలా కనిపించినట్లుంది. అప్పటికే ఆకలిగా ఉందో ఏమో గానీ.. ఎలాగైనా తినేయాలనే (camel tried to eat hair) ఉద్దేశంతో మహిళ జుట్టును నోటితో గట్టిగా పట్టుకుంటుంది. ఊహించని ఈ పరిణామానికి ఆమె అవాక్కవుతుంది. ఒంటె ఇలా చేయడంతో ఆమె చేతిలో ఉన్న పిల్లాడు కూడా భయపడిపోతాడు.

Marriage: పెళ్లి వేడుకలో ఫన్నీ గేమ్.. వరుడే గెలిచాడు కానీ.. పెళ్లయ్యాక అతడి పరిస్థితేంటో.. నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

ఒంటె నుంచి తప్పించుకోవడానికి ఆమె శతవిధాలా ప్రయత్నిస్తుంది. అయినా ఒంటె మాత్రం జుట్టు వదలకుండా పట్టుకుంటుంది. అయితే చివకు ఎలాగోలా ఒంటె నుంచి తప్పించుకుని దూరంగా వెళ్లిపోతుంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఆమె జుట్టు.. ఫాస్ట్ ఫుడ్‌లా కనిపించిందేమో’’.. అని కొందరు, ‘‘వీడియో తీస్తున్న వ్యక్తి.. వెళ్లి కాపాడొచ్చుగా’’.. అని మరికొందరు, ‘‘జంతువల దగ్గర జాగ్రత్తగా ఉండాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 12వేలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: ఆర్డర్ ఆమెదే.. ఆస్వాదించింది మాత్రం ఇంకొకరు.. ఎదురుగా ఉన్న ఆ వ్యక్తి వీడియో తీయకపోయి ఉంటే..!

Updated Date - 2023-07-27T16:07:25+05:30 IST