Travel Bags: జర్నీ అంటే చాలు ట్రాలీ బ్యాగులను బయటకు తీస్తున్నారా..? వాటిని అక్కడ వాడితే ఎంత జరిమానా వేస్తారో తెలిస్తే..!

ABN , First Publish Date - 2023-07-01T18:44:02+05:30 IST

ప్రయాణం అంటేనే సరుకులు, సరంజామాతో కూడుకున్న వ్యవహారం. ఇక దూర ప్రయాణం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు మనుషుల కంటే బ్యాగులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతానికి వెళ్లే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అక్కడ..

Travel Bags: జర్నీ అంటే చాలు ట్రాలీ బ్యాగులను బయటకు తీస్తున్నారా..? వాటిని అక్కడ వాడితే ఎంత జరిమానా వేస్తారో తెలిస్తే..!

ప్రయాణం అంటేనే సరుకులు, సరంజామాతో కూడుకున్న వ్యవహారం. ఇక దూర ప్రయాణం అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొన్నిసార్లు మనుషుల కంటే బ్యాగులే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతానికి వెళ్లే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. అక్కడ కనీవినీ ఎరుగని వింత రూల్ ఉందని చాలా మందికి తెలీదు. ఆ ప్రాంతంలోకి పొరపాటున ట్రాలీ బ్యాగులు తీసుకెళ్లారో ఇక మీ పని అంతే. వారి జరిమానా చూసి ఖంగుతినాల్సి వస్తుంది. ఇంతకీ ఆ ప్రాంతం ఎక్కడ ఉంది.. ఎందుకు ఇలాంటి నిబంధన విధించారు.. అనే వివరాల్లోకి వెళితే..

పరిస్థితులు, ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతాల్లో చిత్రవిచిత్రమైన నిబంధనలు విధిస్తుంటారు. సింగపూర్‌లో (Singapore) చూయింగ్ గమ్ వినియోగాన్ని నిషేధించారు. అలాగే శ్రీలంకలో (Sri Lanka) బుద్ధుడి విగ్రహంతో సెల్ఫీలు దిగడం నేరం. స్విజ్జర్టాండ్‌లో (Switzerland) రాత్రి పది గంటల నుంచి ఉదయం 7గంటల మధ్య టాయిలెట్ ఫ్లష్ చేయడాన్ని నిషేధించారు. శబ్ధ కాలుష్య కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. అదేవిధంగా ఇటలీలోని (Italy) వెనిస్‌లో పావురాలకు ఆహారం వేయకూడదనే నిబంధన ఉంది. ఈ తరహాలోనే యూరోపియన్ దేశం (European country) క్రొయేషియాలోని డుబ్రోవ్నిక్‌లో ట్రాలీ బ్యాగులు (Ban on trolley bags) వాడకూడదన్న రూల్ పెట్టారు. ఈ నగరం ఎంతో పురాతనమైంది. ఇక్కడి భవనాలు, రోడ్డు.. ఇలా ప్రతి ఒక్కదానికీ ఓ చరిత్ర ఉంది. దీంతో ఎక్కడెక్కడి నుంచో పర్యాటకులు ఇక్కడి ప్రదేశాలను చూడటానికి వస్తుంటారు.

Whatsapp: వాట్సాప్ యూజర్లకు పండగలాంటి వార్త.. ఈ ఒక్క విషయంలో ఉన్న అసంతృప్తి కూడా మాటాష్..!?

Croatia.jpg

పర్యాటకుల్లో ఎక్కువ మంది ట్రాలీ బ్యాగులను పట్టుకొస్తారు. రోడ్ల మీద వాటిని ఈడ్చుకుంటూ వెళ్తుండడంతో రాత్రి వేళల్లో స్థానికులకు ఇబ్బందికరంగా మారింది. దీంతో వారంతా కలిసి అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేశారట. వరుస ఫిర్యాదులు వస్తుండడంతో చివరకు అధికారులు.. ట్రాలీ బ్యాగులను నగరంలోకి నిషేధిస్తున్నట్లు ప్రకటించారు. ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే.. ‘‘రెస్పెక్ట్ ది సిటీ’’ క్యాంపెయిన్ కింద రూ.23 వేలు జరిమానా విధిస్తారు. ఈ ఏడాది నవంబర్ నుంచి పర్యాటకులు తమ లగేజీని నగరం వెలుపలే స్టోర్ చేసుకునేలా నిబంధనలు ఉండొచ్చని చెబుతున్నారు. మొత్తానికి ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఇదేం రూల్.. మరీ విచిత్రంగా ఉందే’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Delivery Boy: ఈ డెలివరీ బాయ్‌కు ఇదేం పాడుబుద్ది.. ఓ యువతి పిజ్జా ఆర్డర్ చేస్తే..

Updated Date - 2023-07-01T18:48:10+05:30 IST