Viral Video: డాక్టర్‌లా మారిన బుడ్డోడు.. వైద్యం కోసం వచ్చిన కుక్క.. ఒకరిని మించి మరొకరు.. మొత్తానికి జీవించేశారుగా..

ABN , First Publish Date - 2023-04-26T19:30:50+05:30 IST

కొన్ని కుక్కల తెలివి చూస్తే.. మనుషులు కూడా పనికి రారు అన్నట్లుగా ఉంటుంది. యజమానులు చెప్పింది చెప్పినట్లుగా చేసే కుక్కలు కొన్నైతే.. చెప్పని పనులు కూడా చేసి శభాష్ అని అనిపించుకునే కుక్కలు మరికొన్ని ఉంటాయి. కుక్కలకు సంబంధించిన..

Viral Video: డాక్టర్‌లా మారిన బుడ్డోడు.. వైద్యం కోసం వచ్చిన కుక్క.. ఒకరిని మించి మరొకరు.. మొత్తానికి జీవించేశారుగా..

కొన్ని కుక్కల తెలివి చూస్తే.. మనుషులు కూడా పనికి రారు అన్నట్లుగా ఉంటుంది. యజమానులు చెప్పింది చెప్పినట్లుగా చేసే కుక్కలు కొన్నైతే.. చెప్పని పనులు కూడా చేసి శభాష్ అని అనిపించుకునే కుక్కలు మరికొన్ని ఉంటాయి. కుక్కలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఓ కుక్కకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ కుక్క తన యజమాని కొడుకుతో కలిసి యాక్టింగ్ ఇరగదీసింది. బుడ్డోడు డాక్టర్‌గా మారగా.. పేషెంట్ అవతారం ఎత్తిన కుక్క.. వైద్యం కోసం బాలుడి వద్దకు వెళ్తుంది. వీరి యాక్టింగ్ చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. మొత్తానికి ఒకరిని మించి మరొకరు.. జీవించేశారుగా.. అంటూ కామెంట్లు పెడుతున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఓ బుడ్డోడు టేబుల్‌పై కూర్చుని వైద్య పరికాల బొమ్మలను పక్కన పెట్టుకుని ఉంటాడు. కాసేపటి తర్వాత ఓ కుక్క అక్కడికి వచ్చి నిలబడుతుంది. డాక్టర్‌గా మారిన బాలుడు (boy) .. కాలు పైకి ఎత్తమని కుక్కకు (dog) సూచిస్తాడు. కాసేపటికి తన కాలును ఎత్తి బాలుడికి ఇస్తుంది. కాలుపై ప్లాస్టిక్ వస్తువుతో రెండు మూడు సార్లు కొడుతూ.. ‘‘నొప్పి ఏమైనా ఉందా’’.. అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇస్తాడు. ‘‘అవును డాక్టర్.. చాలా నొప్పి ఉంది’’.. అన్నట్లుగా కుక్క కూడా బదులిస్తుంది.

Viral Vdeo: ఈ ఎలుగుబంటి ఏకాగ్రతకు హ్యాట్సాప్ చెప్పాల్సిందే.. ఆనంద్ మహీంద్రా ఏమన్నారంటే..

తర్వాత బీపీ చెకప్ (BP checkup) ఆకారంలో ఉన్న ఓ ప్లాస్టిక్ వస్తువును ఉంచి పరిశీలిస్తాడు. చివరగా వైద్య పరీక్షలు (Medical tests) పూర్తి చేసి, తగ్గిపోతుందిలే.. అన్నట్లుగా కుక్కకు ధైర్యం చెబుతాడు. ఈ ఘటనను అక్కడే ఉన్న కుటుంబ సభ్యులు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు. ‘‘బుడ్డోడితో పోటీపడి కుక్క చేసిన యాక్టింగ్ సూపర్’’.. అంటూ అభినందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: తప్పు చేయాలన్న ఆలోచన వచ్చిన మరుక్షణమే శిక్ష పడితే.. ఇదిగో ఈ కుర్రాడికి అదే జరిగింది..!

Updated Date - 2023-04-28T21:06:12+05:30 IST