Viral Video: ప్రత్యేకంగా తయారు చేసిన కోడి పటాకులు.. వీటి ప్రత్యేకత ఏంటో చూస్తే నవ్వు ఆపుకోలేరు..
ABN , First Publish Date - 2023-11-04T20:25:26+05:30 IST
దీపావళి వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకోవడం సర్వసాధారణం. ఇక చిన్నపిల్లల ఆనందానికైతే అవధులే ఉండవు. తల్లిదండ్రులతో పేచీ పెట్టుకుని మరీ వివిధ రకాల పటాకులను తెప్పించుకుంటుంటారు. పటాకులు కాల్చే సమయంలో..
దీపావళి వచ్చిందంటే చాలు.. చిన్నాపెద్దా తేడా లేకుండా పటాకులు కాలుస్తూ సంబరాలు చేసుకోవడం సర్వసాధారణం. ఇక చిన్నపిల్లల ఆనందానికైతే అవధులే ఉండవు. తల్లిదండ్రులతో పేచీ పెట్టుకుని మరీ వివిధ రకాల పటాకులను తెప్పించుకుంటుంటారు. పటాకులు కాల్చే సమయంలో ప్రమాదాలు జరగకుండా పెద్దలు కూడా.. వారి పిల్లలకు తారాజువ్వలు, మతాబులు, చిచ్చుబుడ్డి, కాకరపువ్వొత్తులు వంటి పటాకులను తెస్తుంటారు. కాగా, దీపావళి పండుగ దగ్గరపడుతున్న సమయంలో సోషల్ మీడియాలో ఓ పటాకు వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసి నెటిజన్లు తెగ నవ్వుకుంటున్నారు.
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పేల్చిన పటాకు చూసి పగలబడి నవ్వుకుంటున్నారు. కోడి రూపంలో ఉన్న పటాకును (Chicken shaped cracker) తెచ్చి నేల మీద పెడతాడు. తర్వాత పటాకు ముందు వైపు నిప్పు పెడతాడు. మంట అంటించగానే కోడి పటాకు ముందుకు వెళ్తుందేమో అని అంతా అనుకుంటారు. కానీ అందుకు విరుద్ధంగా కోడి వెనుక వైపు నుంచి ఓ బెలూన్ బయటికి వస్తుంది.
ఈ పటాకు చూసేందుకు అచ్చం కోడి గుడ్డు పెట్టినట్లుగా ఉంటుంది. మంట అంటించగానే కోడి గుడ్డు పెట్టినట్లుగా ఉండడం చూసి అంతా తెగ నవ్వుకుంటున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘‘అరే! ఈ పటాకు చాలా ఫన్నీగా ఉందే’’.. అని కొందరు, ‘‘చిన్న పిల్లలకు ఇది నచ్చుతుంది’’.. అని మరికొందరు, ‘‘వాట్ ఏ క్రియేటివిటీ బాసూ’’.. అంటూ ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.