Share News

Viral Video: వావ్.. భలే ఉందిగా బుల్లెట్ బైకు.. ఎక్కడ కొన్నావ్ బ్రదర్ అంటూ.. ఎంత మంది ఇతడిని అడిగారో..!

ABN , First Publish Date - 2023-11-02T21:41:11+05:30 IST

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం చాలా ఈజీ అయిపోయింది. కొందరికి వస్త్రాలు, వాహనాల విషయంలో వింత వింత కోరికలు ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్న వెంటనే వారి కోరికలను నెరవేర్చుకుంటుంటారు. కొందరు..

Viral Video: వావ్.. భలే ఉందిగా బుల్లెట్ బైకు.. ఎక్కడ కొన్నావ్ బ్రదర్ అంటూ.. ఎంత మంది ఇతడిని అడిగారో..!

ప్రస్తుత టెక్నాలజీ యుగంలో ఆలోచనను ఆచరణలోకి తీసుకురావడం చాలా ఈజీ అయిపోయింది. కొందరికి వస్త్రాలు, వాహనాల విషయంలో వింత వింత కోరికలు ఉంటాయి. ఏమాత్రం అవకాశం ఉన్న వెంటనే వారి కోరికలను నెరవేర్చుకుంటుంటారు. కొందరు తమ వాహనాలను చిత్రవిచిత్రంగా తయారు చేసి అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటారు. ఇలాంటి వింత వాహనాలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా విచిత్ర వాహనానికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. బుల్లి బుల్లెట్ బైకును చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘భలే ఉందే బైకు.. ఎక్కడ కొన్నావ్ బ్రదర్’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలోని (Delhi) రోడ్డు పైకి ఓ వ్యక్తి బైకుపై వచ్చాడు. ఇందులో విశేషం ఏమీ లేకున్నా.. అత్యంత చిన్న బుల్లెట్ బైకుపై (small bullet bike) రావడమే ఇందులో స్పెషాలిటీ. పిల్లలు ఆడుకునే బైకు తరహాలో ఉన్న ఈ బుల్లెట్ బైకును చూసి అంతా అవాక్కయ్యారు. మొదట సాధారణ పిల్లల బైకేమో అని అంతా అనుకున్నారు. అయితే రోడ్డుపై అది వెళ్లే వేగం చూసి చివరకు షాక్ అయ్యారు. మిగతా బైకుల తరహాలోనే రయ్యిన దూసుకెళ్లడం చూసి ‘‘అరే! ఇదేంటీ మరీ విచిత్రంగా ఉందే’’.. అనుకుంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Shocking: ఆ కుటుంబంపై పగబట్టిన మృత్యువు.. ఇప్పటికే ముగ్గురి మృతి.. మరొకరి పరిస్థితి విషమం.. ఇంతకీ అసలేం జరిగిందంటే..!

ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆపగా.. చుట్ట పక్కల ఉన్న వాహనదారులంతా ఇతడి బైకునే గమనిస్తున్నారు. కొందరు అతడి వద్దకు వెళ్లి బైకు గురించి ఆరా తీశారు. మరికొందరు ఏకంగా బైకు పైనే కూర్చుని తమ సరదా తీర్చుకున్నారు. చాలా మంది యువకులు ఈ బైకును ఫొటోలు, వీడియోలు కూడా తీసుకున్నారు. కాగా, ఈ బుల్లి బుల్లెట్ బైక్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘బుల్లి బుల్లెట్ బైక్ చాలా బాగుంది’’.. అని కొందరు, ‘‘వావ్! ఇలాంటి బైకును ఎప్పుడూ చూల్లేదు’’.. అని మరికొందరు, ‘‘సూపర్ ఐడియా బ్రదర్’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Wife: రూ.20 వేలు పెట్టి భార్యకు మొబైల్ కొనిచ్చిన భర్త.. వేరే సిటీకి పనికెళ్లాక ఫోన్ చేస్తోంటే నో రెస్పాన్స్.. పక్కింటోళ్లకు కాల్ చేస్తే..!

Updated Date - 2023-11-02T21:41:13+05:30 IST