Husband: వీడేం భర్తండీ బాబూ.. టీ తేవడం ఆలస్యమయిందని భార్యను చంపేశాడు.. రెండేళ్ల క్రితమే పెళ్లయింది కానీ..!

ABN , First Publish Date - 2023-08-04T17:53:06+05:30 IST

రోజు రోజుకూ మనుషులు మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దారుణాలు చేసే వారు కొందరైతే.. మరికొందరు తమ శాడిజాన్ని మొత్తం కుటుంబ సభ్యులపై చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు..

Husband: వీడేం భర్తండీ బాబూ.. టీ తేవడం ఆలస్యమయిందని భార్యను చంపేశాడు.. రెండేళ్ల క్రితమే పెళ్లయింది కానీ..!

రోజు రోజుకూ మనుషులు మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. డబ్బుల కోసం దారుణాలు చేసే వారు కొందరైతే.. మరికొందరు తమ శాడిజాన్ని మొత్తం కుటుంబ సభ్యులపై చూపిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు చిన్న పిల్లలను చిత్రహింసలుకు గురి చేస్తుంటే.. మరికొందరు భార్యలకు నరకం చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఘటనలో భర్త అత్యంత కిరాతకంగా ప్రవర్తించాడు. టీ తేవడం ఆలస్యమయిందని ఏకంగా భార్యనే చంపేశాడు. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) గ్వాలియర్ జిల్లా తాటిపూర్ గ్రామానికి చెందిన మోహిత్ రజక్ అనే వ్యక్తికి సాధన (22) అనే యువతితో రెండేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైన కొన్ని నెలలు ఇద్దరూ సంతోషంగా ఉన్నారు. అయితే తర్వాతే అసలు సమస్య మొదలైంది. అంతవరకూ బాగున్న భర్త.. ఉన్నట్టుండి తనలోని శాడిస్టును బయటపెట్టాడు. రోజూ ఏదో ఒక కారణం చూపుతూ భార్యను (husband tortures his wife) చిత్రహింసలకు గురి చేసేవాడు. మొదట్లో కొన్నాళ్లు భరించిన ఆమె.. తర్వాత తన తల్లిదండ్రులకు తెలియజేసింది. అయినా వాళ్లు ఈ గొడవను పెద్ద సీరియస్‌గా తీసుకోలేదు. కొన్నాళ్లు పోతే అంతా సర్దుకుంటుందనే ఉద్దేశంతో కూతురిని నచ్చజెప్పి పంపించేవారు. అయితే వారు అనుకున్నట్లు మోహిత్‌లో ఎలాంటి మార్పూ రాలేదు.

Bride: రైల్లో ఓ కొత్త జంట జర్నీ.. బాత్రూంకు వెళ్లిన వధువు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆ వరుడికి డౌట్.. రైలంతా వెతికితే..!

ఇటీవల భార్యను మరింతగా టార్చర్ చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం అనూహ్య ఘటన చోటు చేసుకుంది. ఉదయమే గుడికి బయలుదేరుతున్న మోహిత్.. త్వరగా టీ చేయాలని భార్యపై ఒత్తిడి తెచ్చాడు. మాటికి మాటికీ ఇబ్బంది పెడతూ త్వరగా టీ తయారు చేయమని బలవంతపెట్టాడు. దీంతో ఆమె ఎదురు ప్రశ్నించడంతో ఒక్కసారిగా కోపంతో ఊగిపోయాడు. ‘‘నాకే ఎదురు చెబుతావా’’.. అంటూ భార్యపై (Assault on wife) దాడికి దిగాడు. అంతటితో ఆగకుండా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Fridge-Milk: ఫ్రిడ్జ్‌లో పాలను ఎక్కడ ఉంచుతున్నారు..? తెలియక అందరూ చేస్తున్న బిగ్ మిస్టేక్ ఇదే..!

Updated Date - 2023-08-04T17:53:06+05:30 IST