Viral: భార్య ఫోన్‌కు వచ్చిన ఒకే ఒక్క వాట్సప్ మెసేజ్.. ఈ భర్త లైఫ్‌నే మార్చేసింది.. ఈ ఉద్యోగం వేస్ట్ అంటూ రిజైన్ చేసి మరీ..!

ABN , First Publish Date - 2023-08-09T16:07:07+05:30 IST

అప్పటి వరకూ ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన వారు.. వినూత్న ఆలోచలనతో ముందుకు వెళ్తూ తమ రాతను తామే మార్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో.. ‘‘ఒకే ఒక్క ఐడియా.. వారి జీవితాన్నే మార్చేసింది’’.. అని అంతా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలోనూ..

Viral: భార్య ఫోన్‌కు వచ్చిన ఒకే ఒక్క వాట్సప్ మెసేజ్.. ఈ భర్త లైఫ్‌నే మార్చేసింది.. ఈ ఉద్యోగం వేస్ట్ అంటూ రిజైన్ చేసి మరీ..!

అప్పటి వరకూ ఆర్థిక ఇబ్బందులు అనుభవించిన వారు.. వినూత్న ఆలోచలనతో ముందుకు వెళ్తూ తమ రాతను తామే మార్చుకుంటుంటారు. ఇలాంటి సందర్భాల్లో.. ‘‘ఒకే ఒక్క ఐడియా.. వారి జీవితాన్నే మార్చేసింది’’.. అని అంతా అంటూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే దంపతుల విషయంలోనూ ఇలాగే జరిగింది. భార్య ఫోన్‌కు వచ్చిన ఒకే ఒక్క వాట్సప్ మెసేజ్.. ఆ భర్త లైఫ్‌నే మార్చేసింది. దీంతో అప్పటి దాకా చేస్తున్న ఉద్యోగాన్ని కూడా వదిలేశారు. ఇప్పుడు వారు ఎలాంటి స్థితిలో ఉన్నారంటే..

ఉత్తరప్రదేశ్ మీరట్ (Uttar Pradesh Meerut) పరిధి కినానగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. అజిత్ అనే వ్యక్తి భార్యతో కలిసి స్థానికంగా నివాసం ఉంటున్నాడు. ఇతను ఇదే ప్రాంతంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తుండేవాడు. ఆర్థిక సమస్యల కారణంగా ఈ దంపతులు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అయినా అజిత్ తనకు వచ్చే రూ.30వేల జీతంతో కాపురాన్ని నెట్టుకొస్తుండేవాడు. ఈ క్రమంలో ఓ రోజు భార్య ఫోన్‌కు వచ్చిన మెసేజ్ (message) .. వీరి లైఫ్‌నే మార్చేసింది. ఆర్ఎస్ఈటీఐ (Rural Self Employment Training Institutes) ద్వారా చీపురు తయారీలో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు అందులో ఉంది. దీన్ని భర్తకు చూపించింది.

OMG: నది ఒడ్డున నిలబడి కాళ్లకు అంటిన మట్టిని కడుక్కుంటుందో మహిళ.. సడన్‌గా షాకింగ్ సీన్.. 20 గంటల తర్వాత..!

women.jpg

ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్ పాలసీకి ముగ్ధుడైన అజిత్.. చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి, చీపుర్ల తయారీలో (Broom making) ప్రత్యేక శిక్షణ తీసుకున్నాడు. నాలుగు నెలల క్రితం చీపుర్ల తయారీ మొదలుపెట్టాడు. తయరీ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం అజిత్ వివిధ ప్రాంతాల నుంచి మెటీరియల్‌ తీసుకొచ్చి, ఐదు రకాల చీపుర్లను తయారు చేస్తున్నారు. ఇతడి కుటుంబ సభ్యులంతా ఇదే పని చేస్తున్నారు. అలాగే మరో 8మంది మహిళలకూ ఉపాధి కల్పిస్తున్నాడు. కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో RSETI ద్వారా తమకు శిక్షణ ఇవ్వడంతో పాటూ స్వయం ఉపాధి ప్రారంభించేందుకు రుణాలు కూడా అందిస్తున్నారని అజిత్ తెలిపాడు. కాగా, అజిత్ సక్సెస్ స్టోరీకి సంబంధించి వార్తలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.

Divorce: పెళ్లయిన 4 ఏళ్లకే విడాకులకు దరఖాస్తు.. 38 ఏళ్ల తర్వాత.. పిల్లల పెళ్లిళ్లు కూడా అయ్యాక షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన కోర్టు..!

Updated Date - 2023-08-09T16:07:07+05:30 IST