Viral Video: వామ్మో! కిటికీలో ఇరుక్కుపోయిన భారీ కొండచిలువ.. చివరికి ఏం జరిగిందో మీరే చూడండి..
ABN , First Publish Date - 2023-09-26T22:07:50+05:30 IST
ఇళ్లల్లోకి విషసర్పాలు రావడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇక అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు...
ఇళ్లల్లోకి విషసర్పాలు రావడం తరచూ జరుగుతూనే ఉంటుంది. ఇక అటవీ ప్రాంత సమీపంలోని గ్రామాల్లో అయితే ఇలాంటి సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలో కొన్నిసార్లు ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఓ పెద్ద కొండచిలువకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఓ భారీ కొండచిలువ ఇంటి కిటీకీలో ఇరుక్కుపోయింది. చివరకు ఏమైందంటే..
సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ చక్కర్లు కొడుతోంది. ముంబై థానేలో (Mumbai Thane) ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న ఓ భవనం వద్ద ఇటీవల షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అపార్ట్మెంట్ కాంప్లెక్స్‌లోని కిటికీకి సుమారు 10 అడుగుల కొండచిలువ (python) ఇరుక్కుని ఉండడం చూసి స్థానికులు షాక్ అయ్యారు. ఇంట్లోకి వెళ్లే క్రమంలో ప్రమాదవశాత్తు కొండచిలువ కిటికీలో ఇరుక్కుపోయినట్లు గుర్తించారు. అయితే ఎక్కడ తమపై దాడి చేస్తుందో అనే భయంతో స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేశారు.
అక్కడికి చేరుకున్న వారు.. చాలా సేపు శ్రమించి ఎట్టకేలకు కొండచిలువను సురక్షితంగా బయటికి తీశారు. ఈ కొండచిలువ విషపూరితం కాని అల్బినో బర్మీస్ పైథాన్ జాతికి చెందినది తెలిపారు. ఇదే ప్రాంతంలోని సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ సమీపంలోని డ్రెయిన్‌లో జనవరిలో 12 అడుగుల పొడవైన ఇండియన్ రాక్ కొండచిలువను కూడా పట్టుకున్నారు. కాగా, కిటికీలో ఇరుక్కున్న కొండ చిలువ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 5లక్షలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.