Train Robbery: వేగంగా వెళ్తున్న రైల్లో సడన్‌గా తుపాకీ తూటాల శబ్దం.. గగ్గోలు పెట్టిన ప్రయాణీకులు.. అరగంటలో అంతా దోచేశారు..!

ABN , First Publish Date - 2023-09-26T17:03:50+05:30 IST

దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కదులుతున్న రైల్లోకి చొరబడిన దుండగులు సడన్‌గా తూటాల వర్షం కురిపించారు. దీంతో అప్పటిదాకా గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కొక్కరినీ తుపాకీతో బెదిరించిన దొంగలు.. నగలు నగదును దోపిడీ చేశారు. సుమారు..

Train Robbery: వేగంగా వెళ్తున్న రైల్లో సడన్‌గా తుపాకీ తూటాల శబ్దం.. గగ్గోలు పెట్టిన ప్రయాణీకులు.. అరగంటలో అంతా దోచేశారు..!

దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. కదులుతున్న రైల్లోకి చొరబడిన దుండగులు సడన్‌గా తూటాల వర్షం కురిపించారు. దీంతో అప్పటిదాకా గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఒక్కొక్కరినీ తుపాకీతో బెదిరించిన దొంగలు.. నగలు నగదును దోపిడీ చేశారు. సుమారు అరగంటలో మొత్తం దోచేశారు. జార్ఖండ్‌లో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..

జార్ఖండ్‌లోని (Jharkhand) లతేహర్, బర్వాది రైల్వే స్టేషన్‌ల మధ్య ఈ ఘటన చోటు చేసుకుంది. సంబల్‌పూర్-జమ్ముతావీ ఎక్స్‌ప్రెస్ రైలు శనివారం రాత్రి లతేహర్ స్టేషన్‌కి చేరకుంది. ప్రయాణికులు ఎక్కించుకుని అక్కడి నుంచి బయలుదేరింది. రాత్రి కావడంతో రైల్లో ఎక్కవ శాతం ప్రయాణికులు నిద్రలోకి జారుకున్నారు. రైలు లతేహర్ స్టేషన్‌ నుంచి బయలుదేరిన కాసేపటికి అనూహ్య ఘటన చోటు చేసుకుంది. సుమారు 12మంది దుండగలు.. కత్తులు, తుపాలతో రైల్లోకి చొరబడ్డారు. S-8, 8-10 బోగీల్లోకి వెళ్లి ప్రయాణికులను బెదిరించారు. ఈ క్రమంలో పలుమార్లు కాల్పులు కూడా జరిపారు. దీంతో అప్పటిదాకా గాఢనిద్రలో ఉన్న ప్రయాణికులు.. ఈ శబ్ధానికి ఉలిక్కిపడ్డారు. సుమారు 10 రౌండ్లు కాల్పులు జరిపిన దుండగులు.. ప్రయాణికులను బెదిరించి నగలు, నగదును దోచుకున్నారు.

Viral Video: అర్ధరాత్రి షాకింగ్ సీన్.. ఓ యువతిని ఈడ్చుకుంటూ వెళ్తున్న యువకుడు.. అసలు కారణం తెలిసి అవాక్కైన పోలీసులు..!

jarkhand-train-robbery.jpg

కదులుతున్న రైల్లో సుమారు 40నిముషాల పాటు వారు దోపిడీకి పాల్పడ్డారు. అనంతరం బెండి-కుముండి స్టేషన్ల మధ్య నదిపై ఉన్న బ్రిడ్జి వద్దకు చేరుకోగానే రైలు వేగం తగ్గింది. దీంతో దొంగలు చాకచక్యంగా రైలు దిగి పారిపోయారు. ఈ ఘటనతో రైలు దాల్తోన్‌గంజ్ స్టేషన్‌లో సుమారు 3గంటల పాటు నిలిచిపోయింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రయాణికులను విచారించారు. దొంగలు సుమారు రూ.1.50లక్షల నగదు, రూ.4లక్షల విలువైన నగలు, రూ.40వేల విలువైన ఫోన్లను దోపిడీ చేసినట్లు గుర్తించారు. దొంగలంతా 20 నుంచి 25 ఏళ్ల లోపు వారే అని ప్రయాణికులు తెలిపారు. వారిలో ఓ మైనర్ కూడా ఉన్నట్లు చెప్పారు. వారంతా స్థానిక భాషలోనే మాట్లాడుతున్నారని తెలిపారు. కాగా, దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దొంగల కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: చిప్ప్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?

Updated Date - 2023-09-26T17:03:50+05:30 IST