Viral Video: మ్యాగీ ఎక్కువగా తింటుంటారా.. అయితే ఇలాంటి ప్రయోగం ఎప్పుడైనా చేశారేమో చూడండి..

ABN , First Publish Date - 2023-09-24T16:18:59+05:30 IST

మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలతో పాటూ పెద్దలు కూడా దీన్ని ఎక్కువగా తింటుంటారు. ఆకలితో ఉన్నప్పుడు క్షణాల్లో తయారు చేసుకునేందుకు వీలుగా ఉండడంతో పాటూ రుచిగా ఉండడంతో ఎక్కువ మంది మ్యాగీనే ప్రిపేర్ చేస్తుంటారు. కొందరు..

Viral Video: మ్యాగీ ఎక్కువగా తింటుంటారా.. అయితే ఇలాంటి ప్రయోగం ఎప్పుడైనా చేశారేమో చూడండి..

మ్యాగీ అంటే ఇష్టపడని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. చిన్న పిల్లలతో పాటూ పెద్దలు కూడా దీన్ని ఎక్కువగా తింటుంటారు. ఆకలితో ఉన్నప్పుడు క్షణాల్లో తయారు చేసుకునేందుకు వీలుగా ఉండడంతో పాటూ రుచిగా ఉండడంతో ఎక్కువ మంది మ్యాగీనే ప్రిపేర్ చేస్తుంటారు. కొందరు ఇదే మ్యాగీతో చిత్రవిచిత్ర ప్రయోగాలు కూడా చేస్తుంటారు. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో ఇలాంటి విచిత్ర ప్రయోగాలకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా, ఈ తరహా వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది.

సోషల్ మీడియాలో మ్యాగీ వంటకానికి సంబంధించిన వీడియో (Viral video) ఒకటి తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి మ్యాగీని అందరిలా కాకుండా విచిత్రంగా చేయాలనుకున్నాడు. ముందుగా గోధుమ పిండితో చపాతీలు చేశాడు. వాటిని కాల్చే సమయంలో రెండు చపాతీల మధ్యలో సిద్ధంగా ఉచుకున్న (Maggi in between the chapatis) మ్యాగీని పెట్టి ప్యాక్ చేశాడు. చివరగా రెండు వైపులా కాల్చడంతో అతడు అనుకున్న మ్యాగీ పరోటా సిద్ధమైంది.

Viral Video: వామ్మో! ఈ టీచర్ రూటే సపరేటు.. పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఏకంగా క్లాస్ రూంలోనే..

తర్వాత వాటిని పీస్‌లు పీస్‌లుగా కట్ చేసి ప్లేట్‌లో సిద్ధం చేశాడు. ఈ ప్రక్రియను మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘చూస్తుంటనే నోరూరుతోంది’’.., ‘‘మ్యాగీకి సరైన న్యాయం జరిగింది’’, ‘‘ఎలా వస్తాయో.. ఇలాంటి ఐడియాలు’’.., ‘‘ఇది చాలా చెత్తగా ఉంది’’, ‘‘ఈ మ్యాగీ తింటే భూమ్మీద నూకలు చెల్లినట్లే’’.. ‘‘మ్యాగీ ఆరోగ్యానికి మంచిది కాదు’’.. ఇలా ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 3లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Viral Video: చిప్ప్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?

Updated Date - 2023-09-24T16:18:59+05:30 IST