Viral Video: వామ్మో! ఇలాంటి మహిళను ఎక్కడా చూసుండరు.. ఇంటి నిండా కుక్కల మధ్య.. ఈమె చేస్తున్న పని చూడండి..

ABN , First Publish Date - 2023-09-23T21:23:35+05:30 IST

కొందరు తమ పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారో.. తమ ఇంట్లోని కుక్కలు, పిల్లులను కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంటారు. వాటికి చిన్న హాని జరిగినా తట్టుకోలేరు. స్నానం చేయించడం దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటుంటారు. ఇలాంటి యజమానుల గురించి మనందరికీ తెలిసిందే. అయితే...

Viral Video: వామ్మో! ఇలాంటి మహిళను ఎక్కడా చూసుండరు.. ఇంటి నిండా కుక్కల మధ్య.. ఈమె చేస్తున్న పని చూడండి..

కొందరు తమ పిల్లలను ఎంత ప్రేమగా చూసుకుంటారో.. తమ ఇంట్లోని కుక్కలు, పిల్లులను కూడా అంతే ప్రేమగా చూసుకుంటుంటారు. వాటికి చిన్న హాని జరిగినా తట్టుకోలేరు. స్నానం చేయించడం దగ్గర నుంచి ప్రతిదీ దగ్గరుండి చూసుకుంటుంటారు. ఇలాంటి యజమానుల గురించి మనందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వైరల్ అవుతున్న వీడియోలో ఓ మహిళ ప్రవర్తన చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఇంటి నిండా కుక్కలు, పిల్లులను పడుకోబెట్టుకున్న ఆమె.. చివరకు ఏం చేస్తోందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ మహిళకు కుక్కలు, పిల్లులంటే (Dogs and cats) ఎంతో ఇష్టమున్నట్లుంది. అందరిలా ఒకటి, రెండు కాకుండా.. ఏకంగా పదుల సంఖ్యలో కుక్కలు, పిల్లులను పెంచుతోంది. పెంచడమే కాకుండా వాటిని ఇంట్లో బెడ్‪‌పై పడుకోబెట్టి (Dogs and cats sleeping on the bed) మరీ ప్రేమగా చూసుకుంటోంది. ఇంట్లో రెండు పెద్ద బెడ్లు ఏర్పాటు చేసి.. వాటిపై మొత్తం కుక్కలు, పిల్లులను పడుకోబెట్టింది. ఆ స్థలం కూడా సరిపోకపోవడంతో ఇంకా కొన్ని కుక్కలు నేలపై కూడా పడుకున్నాయి. అందులోనూ పిల్లులు, కుక్కలు కలిసిపోవడం కూడా చూడటానికి ఆశ్చర్యంగా అనిపిస్తుంది.

Viral Video: ఈ యువతి ఫార్మా కంపెనీలో ఓ ఉద్యోగి.. రోడ్డు పక్కన ఓ స్టాల్‌ను పెట్టి రోజూ రాత్రిళ్లు ఏం చేస్తోందో మీరే చూడండి..!

ఆమె మాత్రం కుక్కల మధ్యే నేలపై పడుకుని, వాటిని జోకొడుతూ నిద్రపుచ్చుతోంది. కుక్కలు కూడా ఆమె పట్ల వినయ విధేయలతో ఉన్నట్లు కనపడుతోంది. కొన్ని కుక్కలూ ఎంతో బుద్ధిగా పడుకుని ఉంటే.. మరికొన్ని కుక్కలు ఉన్న చోటు నుంచి కదలకుండా యజమాని ఆదేశాలు పాటిస్తున్నట్లు కనిపిస్తాయి. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈమె మనసు ఎంత గొప్పదో’’.. అని కొందరు, ‘‘ఇలాంటి వారు కూడా ఉంటారా’’.. అని మరికొందరు, ‘‘పొరపాటున కుక్కలు దాడి చేస్తే పరిస్థితి ఏంటీ.. కాస్త జాగ్రత్తలు తీసుకోండి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 2లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Lions vs Buffalo: సింహాల గుంపు ఓ వైపు.. దున్నపోతుల గుంపు మరో వైపు.. అడవిలో బిగ్ ఫైటింగ్.. చివరకు..!

Updated Date - 2023-09-23T21:23:35+05:30 IST