Viral Video: వామ్మో! ఈ టీచర్ రూటే సపరేటు.. పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఏకంగా క్లాస్ రూంలోనే..

ABN , First Publish Date - 2023-09-24T15:35:00+05:30 IST

అప్పుడప్పుడూ కొందరు విద్యార్థులు.. తరగతి గదుల్లో పాఠాల మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. తీరా టీచర్ పైకి లేపి ప్రశ్నలు అడగ్గానే నేల చూపులు చూస్తుంటారు. ఇక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు ఏకంగా..

Viral Video: వామ్మో! ఈ టీచర్ రూటే సపరేటు.. పాఠాలు చెప్పాల్సింది పోయి.. ఏకంగా క్లాస్ రూంలోనే..

అప్పుడప్పుడూ కొందరు విద్యార్థులు.. తరగతి గదుల్లో పాఠాల మీద శ్రద్ధ పెట్టాల్సింది పోయి.. అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తుంటారు. తీరా టీచర్ పైకి లేపి ప్రశ్నలు అడగ్గానే నేల చూపులు చూస్తుంటారు. ఇక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ల ప్రవర్తన ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కొందరు ఏకంగా కూర్చునే కునికిపాట్లు కూడా తీస్తుంటారు. అయితే కొన్ని పాఠశాలల్లో మాత్రం ఇందుకు పూర్తి రివర్స్‌లో జరుగుతుంటుంది. విద్యార్థుల పాత్రను టీచర్లే పోషిస్తుంటారు. ఇలాంటి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి ఓ టీచర్ వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. మధ్యప్రదేశ్ (Madhya Pradesh) సెహోర్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. జిల్లా పరిధి మోగ్రా గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో (Govt Primary School) ధరమ్ సింగ్ వర్మ అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తాజాగా, తరగతి గదిలో ఇతడి నిర్వాకం.. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. తరగతిలోకి రాగానే విద్యార్థులకు పాఠాలు చెప్పాల్సిన అతను.. అందుకు విరుద్ధంగా రాగానే (teacher sleeping in classroom) దుప్పటి వేసుకుని పడుకున్నాడు. టీచరే పడుకోవడంతో విద్యార్థులు.. ‘‘ఇదే మంచి తరుణం’’.. అనుకుంటూ బయటికి వెళ్లి ఎంచక్కా ఆటల్లో మునిగిపోయారు. అయినా టీచర్ మాత్రం,, ‘‘ప్రపంచంతో నాకేమీ సంబంధం లేదు’’.. అన్నట్లుగా గాఢనిద్రలో మునిగిపోయాడు.

Viral Video: వామ్మో! ఇలాంటి మహిళను ఎక్కడా చూసుండరు.. ఇంటి నిండా కుక్కల మధ్య.. ఈమె చేస్తున్న పని చూడండి..

ఇతడి నిర్వాకం చూసి షాక్ అయిన కొందరు.. వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ హల్‍‌చల్ చేస్తోంది. దీంతో చివరకు ఈ విషయం జిల్లా వైద్యాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఉన్నతాధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఘటనపై సమగ్ర విచారణ ఆదేశించారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు హామీ ఇచ్చారు. కాగా, ఈ వీడియో చూసిన నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘కూర్చుని కునుకుతీసే టీచర్లు చూశాం గానీ.. ఇలాంటి టీచర్లను ఎప్పుడూ చూడలేదు’’.. అని కొందరు, ‘‘ఈయనకు క్లాస్ రూం, బెడ్ రూం.. ఒకటేనేమో’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి టీచర్లపై కఠిన చర్యలు తీసువాలి’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు.

Viral Video: చిప్ప్ తినే అలవాటు మీకు ఉందా..? అసలు వాటిని ఎలా తయారు చేస్తారో ఒక్కసారైనా చూశారా..?

Updated Date - 2023-09-24T15:35:00+05:30 IST