Marriage Card: నెట్టింట వైరల్‌గా మారిన పెళ్లి కార్డు.. అందులో రాసి ఉన్న పదాలను చూసి పేలుతున్న సెటైర్లు..!
ABN , First Publish Date - 2023-09-13T17:12:21+05:30 IST
కొందరు వివాహ ఆహ్వాన పత్రికలు కూడా ప్రత్యేకంగా ఉండేలా ప్లాన్ చేస్తారు. ఇప్పడు వైరల్ అవుతున్న ఈ ఆహ్వాన పత్రిక చూశారంటే..
పెళ్ళి అనేది జీవితంలో అతిపెద్ద మలుపు. ప్రతి ఒక్కరూ తమ పెళ్లి ఎంతో ఘనంగా నలుగురు గుర్తుపెట్టుకునేలా జరగాలని కోరుకుంటారు. మరికొంతమంది పెళ్లి సమయంలో తమ దర్పం ప్రదర్శించాలని అనుకుంటారు. వివాహ ఆహ్వాన పత్రికలు అయితే చాలా వింతగానూ, ప్రత్యేకంగానూ తయారు చేయిస్తారు. ఈ ఆహ్వాన పత్రికలలో వారు రాయించే విషయాలు కొన్ని చాలా వైరల్ అవుతాయి. ఇప్పుడు ఓ వివాహ ఆహ్వాన పత్రిక సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు ఒకటే పంచులు, సెటైర్లు వేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తీ వివారాల్లోకి వెళితే..
సాధారణంగా పెళ్లి పత్రికలలో(Wedding card) అమ్మాయి, అబ్బాయి పేర్లకు ముందు వారి ఇంటిపేరును ప్రస్తావిస్తారు. కొన్నేళ్ళ కిందట అయితే వధూవరుల పేరు పక్కన వారి క్వాలిఫికేషన్ కూడా వేసేవారు. ఉద్యోగస్తులు అయితే ఫలానా చోట, ఫలానా ఉద్యోగం చేస్తున్నాడు అంటూ మెన్షన్ చేసేవారు. కొందరు నిరాడంబరంగా కేవలం అమ్మాయి, అబ్బాయి పేర్లు మాత్రమే వేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో ఓ ఆహ్వాన పత్రిక వైరల్ అవుతోంది. ఈ ఆహ్వాన పత్రికలో అబ్బాయి, అమ్మాయి ఇంటిపేరు అసలు లేదు. వరుడి పేరు ప్రక్కన ఐఐటీ బాంబే(IIT Bombay) అని, వధువు పేరు పక్కన ఐఐటీ ఢిల్లీ(IIT Delhi) అని వేశారు. సాధారణంగా పెళ్లి పత్రికలో అబ్బాయి, అమ్మాయి ఇంటిపేరు వల్ల వారి కులం పేరు ప్రస్తావించినట్టు అవుతుంది. కానీ ఈ ఆహ్వాన పత్రికలో అలాంటివేమీ వేయకపోవడంతో 'పెళ్లికి కావాల్సింది కులం కాదు ప్రేమ మాత్రమే' అనే క్యాప్షన్ మెన్షన్ చేస్తూ ఈ వివాహ ఆహ్వాన పత్రికను షేర్ చేశారు.
Cow Video: బోరుబావిలో ఓ ఆవు పడటాన్ని ఎప్పుడైనా చూశారా..? ఎలా బయటకు తీశారో చూస్తే..!
ఈ వివాహ ఆహ్వాన పత్రికను Mahesh అనే ట్విట్టర్ ఎక్స్(Twitter X) అకౌంట్ నుండి షేర్ చేశారు. 'పెళ్ళికి కావల్సింది ప్రేమ మాత్రమే' అనే క్యాప్షన్ ను మెన్షన్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు మాత్రం ఒకటే సెటైర్లు వేస్తున్నారు. 'కొన్నేళ్ల క్రితం డిగ్రీ సాధించడం అనేది చాలా గొప్ప విషయం అందుకే అప్పట్లో ఆహ్వన పత్రికలలో అలా మెన్షన్ చేసేవారు. ఇప్పట్లో డిగ్రీలు సాధారణమైపోయాయి' అని ఒకరు కామెంట్ చేశారు. 'అయ్యో అతను తన ర్యాంక్ అందులో పెట్టించడం మరచిపోయినట్టున్నాడు' అని మరొకరు పంచ్ వేశారు. 'ఆహ్వాన పత్రికలో అతని శాలరీ ఎంత? అతని లింక్డ్ఇన్ ఫ్రొఫైల్ మొదలైన వాటిని ప్రస్తావించకపోవడం నన్ను నిరాశకు గురిచేసింది' అని వ్యంగంగా కామెంట్ చేశారు. 'అయ్యో పెళ్ళి విందులో ఏమేమి పెడతారో అది కూడా రాయాల్సింది' అని ఇంకొకరు సెటైర్ వేశారు.