Share News

Woman: అత్యాచారం కేసు పెట్టి.. ఆ తర్వాత సడన్‌గా మాట మార్చేసిన మహిళ.. క్షమించి వదిలేస్తారనుకుంటే ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!

ABN , First Publish Date - 2023-10-18T15:53:15+05:30 IST

రాజ్యాంగం కల్పించిన హక్కులను కొందరు దుర్వినియోగం చేస్తుంటారు. మరికొందరు చట్టంలోని లొసుగులను వాడుకుని పెద్ద పెద్ద నేరాల నుంచి సులభంగా తప్పించుకుంటుంటారు. ఇంకొందరు తప్పుడు కేసులు పెడుతూ పోలీసులు, న్యాయస్థానాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే..

Woman: అత్యాచారం కేసు పెట్టి.. ఆ తర్వాత సడన్‌గా మాట మార్చేసిన మహిళ.. క్షమించి వదిలేస్తారనుకుంటే ఊహించని షాకిచ్చిన హైకోర్టు..!

రాజ్యాంగం కల్పించిన హక్కులను కొందరు దుర్వినియోగం చేస్తుంటారు. మరికొందరు చట్టంలోని లొసుగులను వాడుకుని పెద్ద పెద్ద నేరాల నుంచి సులభంగా తప్పించుకుంటుంటారు. ఇంకొందరు తప్పుడు కేసులు పెడుతూ పోలీసులు, న్యాయస్థానాలను నమ్మించే ప్రయత్నం చేస్తుంటారు. అయితే ఇలాంటి సందర్భాల్లో కొన్నిసార్లు అసలుకే ఎసరు వస్తుంటుంది. తాజాగా ఓ మహిళ విషయంలో ఇలాగే జరిగింది. అత్యాచారం కేసు పెట్టిన ఓ మహిళ.. సడన్‌గా మాట మార్చేసింది. క్షమించి వదిలేస్తారునుకున్న ఆమెకు.. హైకోర్టు భారీ షాక్ ఇచ్చింది. వివరాల్లోకి వెళితే..

ముంబయికి (Mumbai) చెందిన ఓ మహిళ 2017లో ఓ వ్యక్తిపై అత్యాచారం కేసు పెట్టింది. అతడు తనపై రెండుసార్లు అత్యాచారం చేశాడని, గర్భం తీయించుకునేలా ఒత్తిడి చేశాడని ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదుమేరకు అప్పట్లో అబార్షన్ (Abortion) చేసిన వైద్యుడితో పాటూ మొత్తం ఐదుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ కేసు ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉంది. అయితే తాజాగా ఆమె ఉన్నట్టుండి మాట మార్చింది. తనకు ప్రస్తుతం తనకు వివాహమై భర్త, కూతురు ఉన్నారని తెలిపింది. తాను గతంలో చేసుకున్న వివాహం చట్టబద్ధం కాదని, అలాగే తన సొంత నిర్ణయం మేరకే అబార్షన్ చేయించుకున్నానని చెప్పింది.

Same Sex Marriage: మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం.. కోర్టుకు వచ్చి మరీ బాంబు పేల్చిన ఇద్దరు యువతులు.. చివరకు..!

ప్రస్తుతం తాను గతాన్ని మర్చిపోయి ప్రశాంత జీవితం గడుపుతున్నానని.. కావున గతంలో ఉన్న కేసును రద్దు చేయాలని కోరుతూ హైకోర్టును (High Court) ఆశ్రయించింది. దీనిపై విచారించిన హైకోర్టు న్యాయమూర్తులు అనుజా ప్రభుదేశాయ్, ఎన్ఆర్ బోర్కర్లతో కూడిన డివిజన్ బెంచ్ మంగళవారం తీర్పు ఇచ్చింది. ఎఫ్ఐఆర్‌ను రద్దు చేయాలని సూచించిన హైకోర్టు.. రెండు వారాల్లోగా ఇక్కడి టాటా మెమోరియల్ ఆస్పత్రికి రూ.25,00లు చెల్లించాలని ఆదేశించింది. కాగా, ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Viral Video: డ్రైవర్ లేకుండానే దూసుకెళ్తున్న బస్సు.. ఇంజిన్ ముందు వైపు చూస్తే అవాక్కవడం ఖాయం..

Updated Date - 2023-10-18T15:53:15+05:30 IST