Viral Video: బైక్‌పై యువకుల భయంకర విన్యాసాలు.. రాజమౌళి చూస్తే వెంటనే వీరితో మగధీర-2 తీస్తాడేమో..

ABN , First Publish Date - 2023-07-16T16:41:19+05:30 IST

‘‘ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు చేసే విన్యాసాలు అంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో యువకులు.. ఒకరిని మించి మరొకరు పోటీపడి మరీ వింత వింత విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి ..

Viral Video: బైక్‌పై యువకుల భయంకర విన్యాసాలు.. రాజమౌళి చూస్తే వెంటనే వీరితో మగధీర-2 తీస్తాడేమో..

‘‘ఎవడబ్బ సొత్తు కాదురా టాలెంటూ’’.. అని ఓ సినీ కవి అన్నట్లు.. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. కొందరు చేసే విన్యాసాలు అంతా ఆశ్చర్యపోయేలా ఉంటాయి. ప్రస్తుతం సోషల్ మీడియా అందుబాటులో ఉండడంతో యువకులు.. ఒకరిని మించి మరొకరు పోటీపడి మరీ వింత వింత విన్యాసాలు చేస్తుంటారు. ఇలాంటి విన్యాసాలకు సంబంధించిన వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, బైకుపై యువకులు చేసిన విన్యాసాలకు సంబంధించిన వీడియో ఒకటి తెగ చక్కర్లు కొడుతోంది. మగధీర సినిమాలో బైకుపై హీరో చేసిన విన్యాసాన్ని.. ఈ యువకులు రియల్‌గా చేసి చూపించారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘రాజమౌళి చూస్తే వెంటనే వీరితో మగధీర-2 తీస్తాడేమో’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) హల్‌చల్ చేస్తోంది. ఓ గ్రౌండ్‌లో చాలా మంది యువకులు బైకులపై (Youth bike stunts) వివిధ రకాల విన్యాసాలు చేస్తుంటారు. చాలా మంది చుట్టూ నిలబడి ఆసక్తిగా తిలకిస్తుంటారు. ఇంతలో ఇద్దరు యువకులు చేసిన విన్యాసాలు చూసి అంతా నోరెళ్లబెట్టారు. బైకుపై వచ్చిన యువకులు.. ఒక్కసారిగా గాల్లోకి లేచారు. పైకి వెళ్లాక మధ్యలో ఉన్నట్టుండి బైకు హ్యాండిల్ వదిలేశారు. అలాగే పూర్తిగా వెనక్కు వచ్చి, బైకు వెనుక భాగాన్ని పట్టుకుని కొన్ని క్షణాలు వేలాడారు. ఆ వెంటనే మళ్లీ వేగంగా ముందుకు వెళ్లి బైకు హ్యాండిల్‌ను పట్టుకుని కిందకు సేఫ్‌గా ల్యాండ్ అవుతారు.

Viral Video: ఎందుకొచ్చిన పెళ్లిరా అంటూ తల పట్టుకున్న వధూవరులు... భోజన సమయంలో యువకుల నిర్వాకంతో..

ఈ విన్యాసం మొత్తం క్షణాల వ్యవధిలో జరిగిపోతుంది. ఈ యువకులు విన్యాసం చేస్తున్నంతసేపూ అక్కడున్న వారు ఊపిరి బిగపట్టి చూశారు. తర్వాత అంతా చప్పట్లతో వారిని అభినందించారు. ఈ ఘటనను మొత్తం డ్రోన్ కెమెరాతో (Drone camera) చిత్రీకరించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! వీళ్లు రియల్ హీరోస్’’.. అంటూ కొందరు, ‘‘చూస్తుంటేనే భయమేస్తోంది.. వీళ్లెలా చేశారో ఏమో’’.. అంటూ మరికొందరు, ‘‘ఇలాంటి విన్యాసాలను ఎవరూ అనుకరించవద్దు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో లైకులను సొంతం చేసుకుంది.

Viral: ఇది నిజంగా అద్భుతమే.. ఆ ఊళ్లో అయిదేళ్లుగా ఇదే సీన్.. ఒక్కసారైనా ఈ వింతను చూద్దామని తరలి వస్తున్న జనం..!

Updated Date - 2023-07-16T16:49:24+05:30 IST