Viral Video: పామును చూసి ఇంట్లో వాళ్లంతా పరుగులు పెడుతుంటే.. ఈ బుడ్డోడు మాత్రం పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి మరీ..

ABN , First Publish Date - 2023-07-16T18:40:06+05:30 IST

సాధారణంగా పాములు కలలో కనపడినా భయంతో వణికిపోతుంటారు చాలా మంది. అలాంటిది పొరపాటున ఎప్పుడైనా ఎదురుగా వస్తే.. ఇక దాదాపు ప్రాణం పోయినంత పనవుతుంటుంది. స్నేక్ క్యాచర్లు మినహా ఎవరూ వాటిని పట్టుకునే ప్రయత్నం చేయరు. అవగాహన లేమితో కొందరు..

Viral Video: పామును చూసి ఇంట్లో వాళ్లంతా పరుగులు పెడుతుంటే.. ఈ బుడ్డోడు మాత్రం పట్టుకుని ఇంట్లోకి తీసుకెళ్లి మరీ..

సాధారణంగా పాములు కలలో కనపడినా భయంతో వణికిపోతుంటారు చాలా మంది. అలాంటిది పొరపాటున ఎప్పుడైనా ఎదురుగా వస్తే.. ఇక దాదాపు ప్రాణం పోయినంత పనవుతుంటుంది. స్నేక్ క్యాచర్లు మినహా ఎవరూ వాటిని పట్టుకునే ప్రయత్నం చేయరు. అవగాహన లేమితో కొందరు, మద్యం సేవించి మరికొందరు.. అందరిలో హీరో అనిపించుకోవాలనే ఉద్దేశంతో విష సర్పాలతో చెలగాటమాడి ప్రాణాలు పోగొట్టుకున్న సందర్భాలను చాలా చూశాం. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం పాముకు సంబంధించిన ఓ షాకింగ్ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఇంటి వద్దకు వచ్చిన పామును చూసి పెద్దవాళ్లే భయపడి పారిపోతుంటే.. ఓ బుడ్డోడు మాత్రం ఏకంగా దాన్ని పట్టుకుని అందరికీ షాక్ ఇచ్చాడు..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఓ ఇంటి ఆవరణలోకి సడన్‌గా పాము వస్తుంది. దీంతో అక్కడున్న వారంతా భయంతో పక్కకు వెళ్లిపోతారు. అయితే ఓ బుడ్డోడు మాత్రం భయపడకుండా దాని తోక పట్టుకుని (boy caught the snake) లాక్కుంటూ ఇంట్లోకి తీసుకెళ్తాడు. పక్కనే ఓ వ్యక్తి పిల్లోడిని అనుసరిస్తూ ఇంట్లోకి వెళ్తాడు. పామును లాక్కెళ్లిన బాలుడు.. లోపల గదిలో కూర్చుని ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు తీసుకెళ్తాడు. పామును చూడగానే అక్కడున్న వారంతా ‘‘వామ్మో! పాము.. పక్కన పడేయ్’’.. అంటూ దూరంగా వెళ్లిపోతారు.

Viral Video: ఎందుకొచ్చిన పెళ్లిరా అంటూ తల పట్టుకున్న వధూవరులు... భోజన సమయంలో యువకుల నిర్వాకంతో..

పిల్లోడు మాత్రం పామును విడిచిపెట్టకుండా చాలా సేపు దాంతో ఆడుకుంటూ ఉంటాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అది విష సర్పం కాకపోయినా పిల్లాడితో ఇలా చేయించడం చూసి అంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘చూస్తుంటేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది’’.. అంటూ కొందరు, ‘‘ఇలా అలవాటు చేస్తే.. రేపు ఎప్పుడైనా విష సర్పం ఎదురైతే పరిస్థితి ఏంటి’’.. అని మరికొందరు, ‘‘అలా చేయొద్దని వారించకుండా.. వీడియో తీయడం దారుణం’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షల్లో వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral: ఇది నిజంగా అద్భుతమే.. ఆ ఊళ్లో అయిదేళ్లుగా ఇదే సీన్.. ఒక్కసారైనా ఈ వింతను చూద్దామని తరలి వస్తున్న జనం..!

Updated Date - 2023-07-16T18:40:06+05:30 IST