Share News

Viral Video: వారెవ్వా.. ఏం తెలివి బాసూ.. కారు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ వ్యక్తి టెక్నిక్‌ను చూడాల్సిందే..!

ABN , First Publish Date - 2023-11-15T18:07:12+05:30 IST

చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తూ టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకుంటుంటారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద సమస్యలకు సైతం సులువైన మార్గాల పరిష్కరించుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అందుబాటులో ఉన్న వస్తువులతో...

Viral Video: వారెవ్వా.. ఏం తెలివి బాసూ.. కారు ఉన్న ప్రతీ ఒక్కరూ ఈ వ్యక్తి టెక్నిక్‌ను చూడాల్సిందే..!

చాలా మంది వినూత్నంగా ఆలోచిస్తూ టెక్నాలజీని తమకు అనువుగా మార్చుకుంటుంటారు. ఈ క్రమంలో పెద్ద పెద్ద సమస్యలకు సైతం సులువైన మార్గాల పరిష్కరించుకుంటుంటారు. ఈ క్రమంలో కొందరి తెలివితేటలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంటుంది. అందుబాటులో ఉన్న వస్తువులతో వినూత్న పరికరాలను తయారు చేస్తుంటారు. ఇలాంటి ప్రయోగాలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు.. ‘‘వారెవ్వా.. ఏం తెలివి బాసూ’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral video) తెగ వైరల్ అవుతోంది. ఉబెర్ (Uber) క్యాబ్ నడిపే ఓంప్రకాష్ యాదవ్ అనే ఓ వ్యక్తి తెలివితేటలు చూసి అంతా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఓ వ్యక్తి ఇటీవల అతడి క్యాబ్ ఎక్కాడు. కారులో వెళ్తున్న సమయంలో అతడి దృష్టి ఎదురుగా ఉన్న ఓంప్రకాష్ ఫోన్‌పై పడింది. ఫోన్‌ను (Smart phone) చూసుకునేందుకు వీలుగా ఉండడంతో పాటూ ఎటు తిప్పినా కిందపడకుండా గుండ్రంగా తిరుగుతుండడం చూసి ఆ వ్యక్తి అవాక్కయ్యాడు. ‘‘ఇదేంటీ.. ఫోన్ కిందపడకుండా అలా ఎలా సెట్ చేయగలిగారు’’.. అంటూ డ్రైవర్‌ను అడుగుతాడు. దీంతో ఓం ప్రకాష్ అసలు విషయం తెలియజేస్తాడు.

Viral: ఈ ఒక్క ఫొటో.. ఇంటర్నెట్‌ను షేక్ చేసేస్తోందిగా.. బైక్ వెనుక కూర్చున్న ఈ కుర్రాడు పేపర్ హెల్మెట్‌ను పెట్టుకోవడంతో..!

అయస్కాంతంతో కూడిన స్టాండ్‌ను కారుకు ఫిట్ చేశాడు. అలాగే ఫోన్ వెనుక వైపు నాణేన్ని అతికిండాడు. చివరగా ఫోన్‌ను అయస్కాంతానికి తగిలించడంతో చూసుకునేందుకు వీలుగా మారిపోయింది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘డ్రైవర్ తెలితేటలు అమోఘం’’.. అంటూ కొందరు, ‘‘అయస్కాంతం వల్ల ఫోన్ పాడవుతుంది’’.. అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం లక్షకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Earthquake Under Sea: మునుపెన్నడూ చూడని అద్భుత దృశ్యం.. సముద్ర గర్భంలో భూకంపం వస్తే ఎలా ఉంటుందో చూడండి..!

Updated Date - 2023-11-15T18:07:13+05:30 IST