Share News

Viral Video: పెద్ద జంతువును మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్న కొండచిలువ.. కంచె దాటుతుండగా ఉన్నట్టుండి ఏం జరిగిందంటే..

ABN , First Publish Date - 2023-10-24T16:23:52+05:30 IST

కొండచిలువల దాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూసేందుకు వాటి నోరు చిన్నదే అయినా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. జంతువులను వేటాడే..

Viral Video: పెద్ద జంతువును మింగి ప్రాణం మీదకు తెచ్చుకున్న కొండచిలువ.. కంచె దాటుతుండగా ఉన్నట్టుండి ఏం జరిగిందంటే..

కొండచిలువల దాడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూసేందుకు వాటి నోరు చిన్నదే అయినా పెద్ద పెద్ద జంతువులను సైతం అవలీలగా మింగేస్తుంటాయి. ఈ క్రమంలో కొన్నిసార్లు అచ్చం సినిమాల్లో చూపించినట్లుగా వింత వింత ఘటనలు చోటు చేసుకుంటుంటాయి. జంతువులను వేటాడే క్రమంలో ప్రమాదంలో పడిపోయిన పాములు, కొండచిలువలను చూస్తూ ఉంటాం. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఈ తరహా ఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. పెద్ద జంతువును మింగిన కొండచిలువకు ఊహించని సమస్య వచ్చి పడింది. కంచె దాటుతుండగా చివరకు ఏం జరిగిందో చూడండి..

సోషల్ మీడియాలో ఓ వీడియో (Viral Video) తెగ వైరల్ అవుతోంది. ఓ పెద్ద కొండచిలువ (python) వేట కోసం తచ్చాడుతూ చివరకు ఓ షెడ్డు వద్దకు చేరుకుంది. అందులో ఉన్న జంతువులను టార్గెట్ చేసి.. చివరకు చాకచక్యంగా వాటిని వేటాడింది. చివరకు వాటిలో ఓ పెద్ద జంతువును అవలీలగా మింగేసింది. అయితే ఆ తర్వాతే దానికి ఊహించని సమస్య వచ్చిపడింది. అంత పెద్ద జంతువును మింగడంతో కడుపు భారమై కదలడం కష్టమైపోయింది. అయినా ఓపిక తెచ్చుకుని షెడ్డు చుట్టూ ఉన్న కంచెను దాటి వెళ్లిపోయేందుకు ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో ఉన్నట్టుండి ఊహించని ఘటన చోటు చేసుకుంది. కంచెను దాటే క్రమంలో (python caught in trap) కొండచిలువ తల ఓ తాడులో ఇరుక్కుపోతుంది.

Viral Video: కారు ఇంజిన్‌లో ఇరుక్కుపోయిన కొండ చిలువ.. గంటన్నర పాటు కష్టపడి దాన్ని ఎలా బయటకు తీశారంటే..!

అంతకుముందే అక్కడ ఏర్పాటు చేసిన ఉచ్చులో చిక్కుకుపోతుంది. దీంతో కొండచిలువ దాన్నుంచి తప్పించుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. తలను అటూ ఇటూ ఊపడంతో ఉచ్చు మరింత బిగుసుకుపోతుంది. తర్వాత ఉచ్చు ఏర్పాటు చేసిన వారు అక్కడికి వచ్చి కొండచిలువను బయటికి లాగేందుకు ప్రయత్నిస్తారు. ఈ వీడియో ఇంతటితో ముగుస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘వామ్మో! ఈ కొండచిలువను చూస్తుంటే భయమేస్తోంది’’.. అని కొందరు, ‘‘దాని కడుపులో చాలా పెద్ద జంతువు ఉన్నట్టుంది’’.. అని మరికొందరు, షాకింగ్ ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 48వేలకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Viral Video: వామ్మో! బీరు తయారీలో ఇలాక్కూడా చేస్తారా.. ఈ కంపెనీ సిబ్బంది దొంగచాటుగా ఏం చేస్తున్నారో చూడండి..

Updated Date - 2023-10-24T16:23:52+05:30 IST