Train Ticket: టికెట్ లేదని ఓ ప్రయాణీకుడిని ఆపేసిన టీసీ.. అతడి ప్రవర్తనపై డౌట్‌తో పోలీసుల ఎంట్రీ.. బ్యాగును చెక్ చేస్తే కట్టలకొద్దీ కరెన్సీ..!
ABN , First Publish Date - 2023-04-21T18:21:21+05:30 IST
ఓ వ్యక్తి పెద్ద బ్యాగు పట్టుకుని రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. అయితే అందులో లక్షల రూపాయల నగదు ఉందనే విషయం మిగతా ప్రయాణికులకు తెలీదు. అంత నగదు తీసుకెళ్తున్నా అతను డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో కనీసం టికెట్ కూడా తీసుకోలేదు. అయినా..
ఓ వ్యక్తి పెద్ద బ్యాగు పట్టుకుని రైల్వే స్టేషన్‌కి చేరుకున్నాడు. అయితే అందులో లక్షల రూపాయల నగదు ఉందనే విషయం మిగతా ప్రయాణికులకు తెలీదు. అంత నగదు తీసుకెళ్తున్నా అతను డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో కనీసం టికెట్ కూడా తీసుకోలేదు. అయినా ఎవరికీ అనుమానం రాకుండా కవర్ చేసిన అతను.. టీసీ ఎదురుపడగానే కాస్త కంగారుపడ్డాడు. చివరికి టికెట్ తీసుకోలేదని బయటపడడంతో మరింత కంగారుపడ్డాడు. దీంతో అక్కడే ఉన్న పోలీసులకు డౌట్ వచ్చి బ్యాగు ఓపెన్ చేయగా నోట్ల కట్టలు బయటపడ్డాయి. స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైన ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్‌లోని (Rajasthan) కోటా రైల్వే స్టేషన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని (Maharashtra) రత్నగిరి ప్రాంతానికి చెందిన నీలేష్ నారాయణ్ అనే యువకుడు.. ముంబై వెళ్లేందుకు గురువారం అర్థరాత్రి కోట రైల్వే స్టేషన్‌కి (Kota Railway Station) చేరుకున్నాడు. స్టేషన్‌లోని రెండో నంబర్ ప్లాట్‌ఫామ్‌పై రైలు కోసం వేచి చూస్తూ ఉన్నాడు. అతడి చేతిలో పెద్ద బ్యాగు పట్టుకుని ఉన్నాడు. అయితే అందులో లక్షల రూపాయల నగదు (Lakhs of rupees cash in the bag) ఉందనే విషయం ఎవరికీ తెలియదు. అంత డబ్బును తీసుకెళ్తున్న అతను డబ్బులు మిగులుతాయనే ఉద్దేశంతో టికెట్ తీసుకోకుండానే లోపలికి వెళ్లాడు. ఎలాంటి అనుమానమూ కలగకుండా అప్పటిదాకా బాగానే కవర్ చేశాడు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన టీసీకి మాత్రం అతడిపై అనుమానం కలిగి దగ్గరికి వెళ్లాడు. ప్రశ్నించగా టికెట్ లేదని తెలిసింది.
Viral Video: వామ్మో.. ఈ వ్యక్తి టాలెంట్ మామూలుగా లేదుగా.. వీర లెవల్‌లో ఇంగ్లీషులో దంచేస్తున్నాడు..!
టీసీతో (Ticket Collector) మాట్లాడే సమయంలో అతను భయం భయంగా ఉండడం చూసి అక్కడే ఉన్న రైల్వే పోలీసులకూ (Railway Police) అనుమానం కలిగింది. దీంతో అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో అతడి బ్యాగును ఓపెన్ చేయగా.. మొత్తం రూ.97 లక్షల రూపాయలు (97 lakh rupees) బయటపడ్డాయి. దీంతో పోలీసులంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. నగదుకు సంబంధించి ఎలాంటి పత్రాలూ లేకపోవడంతో వెంటనే అతన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కి తరలించారు. ఆ మొత్తాన్ని ముంబైకి తీసుకెళ్తున్నట్లు చెప్పిన నిందితుడి.. మిగతా వివరాలు ఏమీ చెప్పలేదు. అతడికి అంత నగదు ఎవరు ఇచ్చారు, ముంబైలో ఎవరి వద్దకు తీసుకెళ్తున్నాడు, దీని వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు.. అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.