Viral News: విడాకులు రాగానే పండగ చేసుకున్న యువతి.. పెళ్లి దుస్తుల్ని కాల్చేసి.. మాజీ భర్తతో దిగిన ఫొటోలను చింపేస్తూ..
ABN , First Publish Date - 2023-04-20T18:34:33+05:30 IST
పరీక్షల్లో పాసైనప్పుడు, కోరుకున్న ఉద్యోగం దక్కినప్పుడు, ప్రేమించిన వాడే భర్తగా దొరికినప్పుడు.. యువతులు పండుగ చేసుకోవడం సర్వసాధారణమే. అయితే భర్తతో విడాకులు తీసుకునే సమయంలో కూడా పండుగ చేసుకునే వారు ఉంటారా.. అంటే..
పరీక్షల్లో పాసైనప్పుడు, కోరుకున్న ఉద్యోగం దక్కినప్పుడు, ప్రేమించిన వాడే భర్తగా దొరికినప్పుడు.. యువతులు పండుగ చేసుకోవడం సర్వసాధారణమే. అయితే భర్తతో విడాకులు తీసుకునే సమయంలో కూడా పండుగ చేసుకునే వారు ఉంటారా.. అంటే.. నిజమా!.. అలాంటి వాళ్లు కూడా ఉంటారా.. అనే సందేహం వస్తుంది. కానీ ఇప్పుడు చెప్పుకోబోయే యువతి గురించి తెలుసుకుంటే.. షాక్ అవడం ఖాయం. విడాకులు రాగానే పెళ్లి దుస్తుల్ని కాల్చేసి, మాజీ భర్తతో దిగిన ఫొటోలను చింపేసింది. అంతటితో ఆగకుండా ఆమె చేసిన పని చూసి.. వామ్మో! ఈ ఫొటోలను మాజీ భర్త చూశాడంటే హార్ట్ అటాక్ రావడం ఖాయం.. అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు..
అమెరికాకు చెందిన లారెన్ బ్రూక్ అనే మహిళ (American woman) వింత నిర్వాకంతో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. భర్త నుంచి విడిపోయిన సందర్భంలో ఏ మహిళ అయినా తీవ్ర మనస్థాపానికి గురవుతుంది. తన భవిష్యత్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తూ డిప్రెషన్‌కు (Depression) గురవుతారు. అయితే ఈ అమెరికా మహిళ మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరించింది. భర్త నుంచి విడాకులు (Divorce) రాగానే సంబరాలు చేసుకుంది. అది కూడా అలాంటిలాంటి సంబరం కాదు.. షాంపైన్‌ను (Champagne) గాల్లోకి విరజిమ్ముతూ.. ‘‘ఏహే!.. నాకు విడాకులు వచ్చేశాయ్’’.. అంటూ గెంతులేసింది.
అంతటితో ఆగకుండా తన పెళ్లి నాటి దుస్తుల్ని కాల్చేసింది. అనంతరం తన భర్తతో దిగిన ఫొటోలను చింపేసి, మరికొన్ని ఫొటోలను కాలితో తొక్కి పగులగొట్టింది. చివరకు తన మాజీ భర్తకు (ex husband) విషెష్ చెబుతూ ఓ సందేశం రాసి.. సదరు ఫొటోలన్నింటినీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ (Viral photos) అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘అరె! ఇలాంటి మహిళను మేమెక్కడా చూల్లేదు’’.. అని కొందరు, ‘‘జీవితంలో ఇదొక అరుదైన ఘటన’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.