Viral Video: ప్రేయసికి ప్రపోజ్ చేసేందుకు వెరైటీ ప్లాన్.. కిడ్నాప్ చేసి సర్ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. చివరకు జరిగిందిదీ..!
ABN , First Publish Date - 2023-04-20T15:31:50+05:30 IST
లవ్ ప్రపోజ్ చేసే పద్ధతి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. చాలా మంది తమ లవ్ ప్రపోజల్ జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. కొందరు తమ ప్రేయసికి సినిమా తరహాలో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. మరికొందరు, సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో..
లవ్ ప్రపోజ్ చేసే పద్ధతి ఒక్కొక్కరిది ఒక్కోలా ఉంటుంది. చాలా మంది తమ లవ్ ప్రపోజల్ జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకుంటుంటారు. కొందరు తమ ప్రేయసికి సినిమా తరహాలో లవ్ ప్రపోజ్ చేస్తుంటారు. మరికొందరు, సర్ప్రైజ్ చేద్దామనే ఉద్దేశంతో ఇంకో అడుగు ముందుకేసి ఇతరులకు భిన్నంగా ఆలోచిస్తుంటారు. ఇలాంటి వారి తెలివితేటలు చూస్తే.. ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో! అని అనిపిస్తుంటుంది. ప్రస్తుతం ఓ యువకుడు తన ప్రేయసికి చేసిన లవ్ ప్రపోజల్‌కు సంబంధించిన వీడియోలు, ఫొటోలు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రేయసిని కిడ్నాప్ (kidnap) చేసి ప్రపోజ్ చేసేందుకు వెరైటీ ప్లాన్ చేశాడు. చివరకు ఏమైందంటే..
సోషల్ మీడియాలో ప్రేమికులకు సంబంధించిన వీడియో తెగ వైరల్ (Viral videos) అవుతోంది. ఆస్ట్రేలియాలోని సిడ్నీకి (Australia Sydney) చెందిన ఒక వ్యక్తి తన ప్రేయసికి వినూత్నంగా లవ్ ప్రపోజ్ (Love proposal) చేయాలని అనుకున్నాడు. లెబనాన్‌లో (Lebanon) విహారయాత్రలో ఉన్న ప్రేయసికి షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. కారులో కాఫీ తాగుతూ విశ్రాంతి తీసుకుంటున్న యువతి (young woman) వద్దకు ఓ వ్యక్తి వచ్చాడు. సడన్‌గా ఆమె తలకు తుపాకీ గురిపెట్టి, అరిస్తే కాల్చేస్తా అని బెదిరించాడు. మరుక్షణమే ఆమె కళ్లకు గంతలు కట్టి.. అదే కారులో ఓ బీచ్ వద్దకు తీసుకెళ్లాడు. అరిస్తే ఎక్కడ కాల్చేస్తాడో అనే భయంతో ఆమె భయంతో మిన్నకుండిపోయింది. బీచ్ వద్ద ఆమెను కారు నుంచి దింపి కొంత దూరం నడిపించాడు.
Crime News: మరీ ఇంత నీచమా..? పూడ్చిపెట్టిన మహిళ మృతదేహాన్ని బయటకు తీసి మరీ అత్యాచారం చేశారు..!
తనని ఎక్కడి తీసుకెళ్తున్నాడో, ఏం చేస్తాడో.. అనే భయంతో అతడి వెంటే నడుచుకుంటూ వెళ్లింది. కొంత దూరం వెళ్లాక కళ్లకు ఉన్న గంతలను విప్పేశాడు. కళ్లు తెరిచిన ఆమె.. ఎదురుగా కుటుంబ సభ్యులతో పాటూ తన ప్రియుడు కూడా ఉండడం చూసి అవాక్కైంది. ప్రియుడు వెంటనే ఆమె వద్దకు వచ్చి మోకాళ్ల మీద నిల్చుని లవ్ ప్రపోజ్ చేశాడు. అప్పటికే షాక్‌లో ఉన్న ఆమె.. ఈ సర్ప్రైజ్ ప్రపోజ్ చూసి ఏడ్చేసింది. తర్వాత కోలుకుని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ‘‘ఇది బ్యాడ్ ఐడియా’’.. అని కొందరు, ‘‘ఇదేం లవ్ ప్రపోజ్ రా నాయనా’’.. అని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు.