Crime: మూడో అంతస్థులో బంగారం షాపు.. అడుగడుగునా 16 సీసీ కెమెరాలు.. అయినా ఎలా చోరీ చేయగలిగారంటే..!

ABN , First Publish Date - 2023-10-06T18:59:25+05:30 IST

చోరీ ఘటనలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.. దొంగలు అనేక రకాల ప్లాన్లు వేస్తుంటారు. కొందరు టెక్నాలజీపై పట్టు పెంచుకుని ఎంతో తెలివిగా చోరీలు చేస్తుంటే.. మరికొందరు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు...

Crime: మూడో అంతస్థులో బంగారం షాపు.. అడుగడుగునా 16 సీసీ కెమెరాలు.. అయినా ఎలా చోరీ చేయగలిగారంటే..!
ప్రతీకాత్మక చిత్రం

చోరీ ఘటనలు చూస్తే కొన్నిసార్లు ఆశ్చర్యం కలుగుతుంటుంది. పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు.. దొంగలు అనేక రకాల ప్లాన్లు వేస్తుంటారు. కొందరు టెక్నాలజీపై పట్టు పెంచుకుని ఎంతో తెలివిగా చోరీలు చేస్తుంటే.. మరికొందరు ఆధారాలు దొరక్కుండా ఉండేందుకు చిత్రవిచిత్రమైన ప్రయోగాలు చేస్తుంటారు. ఇలాంటి ఘటనలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, హర్యానాలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. అడుగడుగునా సీసీ కెమెరాలు ఉన్న బంగారు షాపులో దొంగలు చోరీ చేసిన విధానం చూసి అంతా అవాక్కయ్యారు. వివరాల్లోకి వెళితే..

హర్యానాలోని (Haryana) అంబాలా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కంటోన్మెంట్‌లోని పూజా విహార్ కాలనీకి చెందిన అను రాణి , పవన్ దంపతులు.. కర్దన్ రోడ్డులో మెహక్ కాస్మెటిక్ పేరుతో బంగారు దుకాణం (gold shop) నిర్వహిస్తోంది. మొత్తం మూడు అంతస్తుల్లో ఏర్పాటు చేసిన దుకాణంలో సెక్యూరిటీ వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేశారు. మొత్తం 16సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటూ మిగతా భద్రతా చర్యలు కూడా తీసుకున్నారు. అయినా దుండగులు ఈ షాపులో చోరీకి పాల్పడడం చూసి అంతా షాక్ అయ్యారు. చోరీ చేసిన దొంగలు షాపులో ముందుగా రెక్కీ నిర్వహించారు. సెక్యూరిటీ వ్యవస్థను గమనించిన వారు.. చాలా తెలివిగా వ్యవహరించారు.

Viral Video: బొట్లు పెట్టి.. దండలు వేసి మరీ ఈ ఏనుగుకు ప్రభుత్వ అధికారులు ఎందుకు సన్మానం చేస్తున్నారంటే..!

ముసుగు ధరించిన ముగ్గురు దొంగలు.. ముందే సిద్ధం చేసి పెట్టుకున్న 15 అడుగుల నిచ్చెనను వెంట తెచ్చుకున్నారు. వీధిలోంచి నేరుగా మూడో అంతస్థులోకి నెచ్చెన సాయంతో వెళ్లారు. లోపల ఉన్న రూ.40వేల నగదు, రూ.5లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. వెళ్తూ వెళ్తూ సీసీ కెమెరాలకు సంబంధించిన డీవీఆర్‌ను కూడా ఎత్తుకెళ్లారు. మరుసటి రోజు షాపు తెరచిన యజమాని పవన్.. చోరీ జరగడం చూసి షాక్ అయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని పరిశీలించారు. వేలిముద్రల నిపుణుల బృందం ఆధారాలు సేకరించింది. కేసు నమోదు చేసిన పోలీసలుు.. షాపు చుట్టు పక్కల ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను పట్టుకునే పడ్డారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలోనూ తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.

Anand Mahindra: టీమ్ ఇండియా జెర్సీ ఓకే కానీ.. దానిపై 55 అనే నెంబర్ ఏంటి..?.. నెటిజన్లకు ఆనంద్ మహీంద్ర వెరైటీ టాస్క్..!

Updated Date - 2023-10-06T18:59:25+05:30 IST