Singing Cat: ఈ పిల్లిని తక్కువ అంచనా వేయొద్దు.. పొరపాటున పాటల పోటీ పెట్టారంటే దబిడిదిబిడే..

ABN , First Publish Date - 2023-09-03T16:58:51+05:30 IST

పెంపుడు జంతువులు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. మరికొన్నిసార్లు వాటి ప్రవర్తన మనుషులకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుంది. ప్రధానంగా కుక్కలు, పిల్లులు కొన్నిసార్లు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి ...

Singing Cat: ఈ పిల్లిని తక్కువ అంచనా వేయొద్దు.. పొరపాటున పాటల పోటీ పెట్టారంటే దబిడిదిబిడే..

పెంపుడు జంతువులు చేసే పనులు చూస్తే కొన్నిసార్లు చిత్రవిచిత్రంగా ఉంటాయి. మరికొన్నిసార్లు వాటి ప్రవర్తన మనుషులకు ఏమాత్రం తగ్గని విధంగా ఉంటుంది. ప్రధానంగా కుక్కలు, పిల్లులు కొన్నిసార్లు మనుషులను అనుకరిస్తూ చేసే పనులు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. ఇలాంటి వీడియోలు ఇటీవల సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా, ఓ పిల్లి వీడియో నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. పాటలు పాడుతున్న వ్యక్తికి లయబద్ధంగా కోరస్ ఇస్తున్న పిల్లిని చూసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ‘‘పాటల పోటీ పెడితే ఈ పిల్లి ఫస్ట్ ప్రైజ్ కొట్టడం ఖాయం’’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.

సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ (Viral video) అవుతోంది. ఓ వ్యక్తి తన పెంపుడు పిల్లి (pet cat) పాటలు పాడటంలో ట్రైనింగ్ ఇస్తాడు. చివరగా దాని పనితనానికి ఓ టెస్ట్ పెడతాడు. ఫోన్‌లో వీడియో కెమెరా ఆన్ చేసి ఓ రాగం అందుకుంటాడు. అది విన్న పిల్లి.. ‘‘ఓహో.. ఈ పాట నాకు బాగా వచ్చు’’.. అని ఎక్స్‌ప్రెషన్ ఇస్తూ.. వెంటనే ఆ పాటకు లయబద్ధంగా (cat singing the chorus) కోరస్ పాడుతుంది. తన యజమాని పాడుతున్న పాటకు అచ్చం అలాగే కోరస్ ఇవ్వడం చూస్తే.. నిజంగా ఈ పిల్లికి మాటలు వస్తాయేమో... అని అనిపిస్తుంది.

School boys: చూసేందుకు వీళ్లు చేస్తోంది అల్లరే అయినా.. అందులో దాగున్న వారి ట్యాలెంట్ చూస్తే.. చప్పట్లు కొట్టాల్సిందే..

ఇలా చాలా సేపు తన యజమానికి అనుకరిస్తూ పిల్లి రాగం తీస్తుంది. అది కూడా ‘‘ఆఆఆ... ఆఆఆ’’.. అంటూ రాగం తీస్తూ అచ్చం మనిషిలా పాడటం అందరినీ ఆకట్టుకుంటోంది. సదరు వ్యక్తి ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం వైరల్‌గా మారింది. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘‘వావ్! ఈ పిల్లి ట్యాలెంట్ సూపర్బ్’’.. అంటూ కొందరు, ‘‘ఆహా!.. ఈ పిల్లి ఎంత బాగా పాడుతోంది’’.. అని మరికొందరు, ‘‘ఇలాంటి పిల్లిని మేమెప్పుడూ చూడలేదు’’.. అని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 15లక్షలకు పైగా లైక్‌లను సొంతం చేసుకుంది.

Crime news: డబ్బు సంపాదనకు భార్యాభర్తల వెరైటీ ప్లాన్.. వారి బెడ్రూంలోని బల్బ్ హోల్డర్‌ను విప్పి చూసిన పోలీసులకు దిమ్మతిరిగే షాక్..

Updated Date - 2023-09-03T16:58:51+05:30 IST